Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌..పెన్షన్‌ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి

ఆస్ట్రేలియా ప్రధాన ఆంటోనీ అల్బనీస్‌ అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించారు. కేవలం పెన్షన్‌ డబ్బులతో ఆల్బనీస్ తల్లి అతనిని పెంచి పెద్దచేసారు. అంగవైకల్యం ఉన్నవాళ్లకు లభించే పెన్షన్‌తో తల్లి ఒక్కతే ఆయన్ను పెంచి పెద్దచేశారు. కడుపు నింపకునేందుకు పక్కంటివారిమీద ఆధారపడ్డ గడ్డురోజులు ఎన్నో తన జీవితంలో ఉన్నాయని అల్బనీస్ గుర్తుచేసుకున్నారు.

Australia pm Anthony Albanese :  ఆస్ట్రేలియాలో అధికారం చేతులు మారింది. 2007 తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పేదరికంలో పుట్టిపెరిగిన ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధానమంత్రి పదవి వరించింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే స్కాట్ మోరిసన్ హుందాగా ఓటమిని అంగీకరించారు.

కరోనా కట్టడిలో వైఫల్యం, అవినీతి ఆరోపణలు ఆస్ట్రేలియాలో అధికారమార్పుకు దారితీశాయి. దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న లిబరల్ పార్టీని సాగనంపారు ఆస్ట్రేలియన్లు. 2007 తర్వాత తొలిసారి లేబర్ పార్టీకి అధికారం అప్పగించారు. ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఆంటోనీ అల్బనీస్ బాధ్యతలు స్వీకరించారు. క్వాడ్ సదస్సు నేపథ్యంలో ఎన్నికల పూర్తి ఫలితాలు రాకముందే స్కాట్ మారిసన్ తన ఓటమిని అంగీకరించారు. కొత్త ప్రధాని క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు వీలుగా పదవికి రాజీనామా చేశారు.

అల్బనీస్ 1996 నుంచి పార్లమెంట్‌కు ఎన్నికవుతున్నారు. 2007 నుంచి 2013 వరకు మంత్రిగా పనిచేసిన ఆయన 2013లో ఉపప్రధాని అయ్యారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అల్బనీస్‌ గెలుపుకు బాటలు వేశాయి. కరోనా తదనంతర పరిణామాల ప్రభావంతో ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోలాగే ఆస్ట్రేలియాలోనూ ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో ప్రజలకు ఆర్థికసాయం చేస్తామని, ద్రవ్యోల్బణాన్ని అరికడతామని, భద్రమైన జీవనం కల్పిస్తామని అల్బనీస్ ఇచ్చిన హామీలను ఓటర్లు నమ్మారు. వాతావరణ మార్పులపై అల్బనీస్ ప్రకటించిన ప్రణాళికా ఆయనకు అధికారం కట్టబెట్టింది. సమిష్టి లక్ష్యాల కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని ప్రధానిగా ఎన్నికైన అనంతరం అల్బనీస్ పిలుపునిచ్చారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటున్నానని కొత్త ప్రధాని వ్యాఖ్యానించారు.

పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాన ఆంటోనీ అల్బనీస్‌..పెన్షన్‌ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి
అల్బనీస్ పేదరికంలో పుట్టిపెరిగారు. అంగవైకల్యం ఉన్నవాళ్లకు లభించే పెన్షన్‌తో తల్లి ఒక్కతే ఆయన్ను పెంచి పెద్దచేశారు. కడుపు నింపకునేందుకు పక్కంటివారిమీద ఆధారపడ్డ గడ్డురోజులు ఎన్నో తన జీవితంలో ఉన్నాయని అల్బనీస్ గుర్తుచేసుకున్నారు. తన కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన మొదటి వ్యక్తి అల్బనీసే. యూనివర్శిటీలో ఎకనామిక్స్ డిగ్రీ చేస్తూ రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు.

 

 

ట్రెండింగ్ వార్తలు