Viral Duck : ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతున్న బాతు

ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని తిడుతోంది. దీంతో ఈ బాతు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.

duck that says ‘you bloody fool’: ఓ బాతు బూతులు మాట్లాడుతోంది?ఏంటీ బాతు బాత్ బాత్ అంటాయి గానీ బూతులు మాట్లాడతాయా? మరీ విడ్డూరం కాకపోతే అని అనుకోవచ్చు. కానీ ఓ బాతు మాత్రం నిజంగా తిడుతోంది.ఆస్ట్రేలియాలో ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని అంటోంది. కాదు కాదు తిట్టటం నేర్చుకుంది. బ్లడీ ఫూల్ అంటే తిట్టే కదా.. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన సదరు బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్..సొసైటీ రికార్డు చేసింది.

ఈ బాతు తన కేర్ టేకర్ నుంచి ఈ ‘యూ బ్లడీ ఫూల్’ అనే మాటను నేర్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి మస్క్ బాతులు మనుషులు మాటలను అనుకరిస్తాయని అంటున్నారు. ఈ బాతుకు రిప్పర్‌ అని పేరు పెట్టారు పరిశోధకులు.నిజానికి మస్క్ బాతులు మనుషులు మాటలను అనుకరిస్తాయని అంటున్నారు.ప్రస్తుతం ఈ బాతు ఆడియో నెట్టింట తెగ సందడి చేసేస్తోంది. ఆ ఆడియో విని నెటిజన్లు ఊరుకుంటారా ఏంటీ. వాళ్లు కూడా ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. బాతులు కూడా బూతులు మాట్లాడితే ఇంకెలాగరా బాబూ అంటున్నారు.
Read More: వామ్మో..బండబూతులు తిడుతున్న చిలుకలు..వినలేక చెవులు మూసుకుంటున్న జనాలు..!!

కాగా..కస్తూరి బాతులు, చిలుకలు, మైనాలు వంటి పక్షులు మాట్లాడతాయని తెలుసు.ఈ పక్షులు స్వరాలు చేసే సామర్థ్యం ఉందని అధ్యయనంలో తేలింది. ఈ బాతు కూడా ఇలా మాటలు పలకడం ఆశ్యర్యానికి గురి చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాతికి చెందిన బాతు మనుషుల మాటలను అనుకరిస్తుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

కాగా..యూకేలోని లింకన్ షేర్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఓ చిలుక బూతులు మాట్లాడిన చిలుకలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆ చిలుకలు జూకు వచ్చినవారిని ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిట్టేవి. దీంతో సందర్శకులు ఆ చిలుకలను ఆశ్చర్యపోతూ చూసేవారు. ఆ తరువాత జూ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా ఆ చిలుకలను ప్రదర్శ నుంచి తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు