Kate Orchard : యుద్ద విమానం నడిపిన 99 ఏళ్ల మహిళ..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

90 ఏళ్ల జీవించటమే గొప్పగా ఉన్న ఈరోజుల్లో 99 ఏళ్ల వయస్సులో యుద్ధ విమానం నడిపిందో మహిళ. ఎందుకో తెలిస్తే అభినందించకుండా ఉండలేేం.

Kate Orchard : 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు, 40 ఏళ్ల కే నడుము నొప్పులు..50 ఏళ్లు వచ్చేసరికి ఇక జీవితం అయిపోయింది అనుకుంటాం. ఇక 60 ఏళ్లకు ఇంకే చేస్తాం అన్నట్లుగా నిరాశల్లో పడిపోతాం. అటువంటిది 90 ఏళ్ల జీవించటమే గొప్పగా ఉన్న ఈరోజుల్లో 99 ఏళ్ల వయస్సులో యుద్ధ విమానం నడిపిందో మహిళ. 99 ఏళ్లవయస్సులో ఏకంగా యుద్ధ విమానాన్నే నడిపి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ 99 ఏళ్ల మహిళా మణిపూస పేరు ‘ కేట్ ఆర్చర్డ్’..కేట్ ఈ వయస్సులో కూడా విమానాన్ని నడిపింది అనే గొప్పతనం చాటు కోవటం కోసమో..లేదా ఏ రికార్డు కోసమో యుద్ధ విమానాన్ని నడలేదు.  స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించటానికి తన 99 ఏళ్ల వయస్సులో యుద్ధ విమానాన్ని నడిపారామె. కేట్ కు మరోకొన్ని రోజుల్లో 100 ఏళ్ల రాబోతున్నాయి.

సాధారణంగా వృద్ధాప్యంలో చాల బలహీనంగా ఉంటారు. పైగా జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. సొంత కుటుంబ సభ్యుల్ని కూడా మర్చిపోతుంటారు. నడుము ఒంగిపోయి సరిగ్గా నడవను కూడా నడవలేరు. వారి సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. కానీ కార్న్‌వాల్‌లో నివసించే 99 ఏళ్ల కేట్ ఆర్చర్డ్ అనే బ్రిటీష్ మహిళ మాత్రం ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపేసింది. 99 ఏళ్ల వయసులో విమానం నడపడం అంటే మామూలు విషయం కాదు.

కేట్ గతంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. ఆమె పైలట్‌గా రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారామె.కేవలం 20 ఏళ్ల వయస్సులో మహిళా సహాయక వైమానిక దళంలో చేరిన కేట్..1941 నుండి 1945 వరకు నాజీలతో పోరాటంలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు ఆమె వయస్సు 99 సంవత్సరాలు. ఈ వయసులో యుద్ధ విమానం నడపడం నిజంగా చాలా కష్టం. కానీ ఆమె మాత్రం ఏదో ప్రతీరోజు ఆ యుద్ధ విమానంమీదనే తిరుగుతున్నట్లుగా చాలా ఈజీగా నడిపేసింది.

కేట్‌ విమానాన్ని సులభంగా టేకాఫ్ చేయడమే కాకుండా అంతే సులభంగా ల్యాండ్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఆయన కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసారు.కేట్ 72 ఏళ్ల కుమారుడు బెన్ తల్లిని చప్పట్లతో ఉత్సాహపరిచారు. అభినందించారు.

కేట్‌కు మరికొన్ని రోజుల్లో 100 ఏళ్లు రానున్నాయి. విమానంలో ప్రయాణించడం ద్వారా తన పాత రోజులను గుర్తు కొచ్చాయంటున్నారు కేట్. అంతేకాదు విమానం నడపడం అనేది తనకి పెద్ద కష్టమేమి కాదంటూ ఏదో సాధారణ విషయంలో చెప్పాసారామె..

ట్రెండింగ్ వార్తలు