‘Chicken Parenting’ : చైనాలో కొత్త ట్రెండ్..పిల్ల‌ల‌కు కోడి రక్తం ఇంజెక్ష‌న్స్ చేయిస్తున్న పేరెంట్స్

చైనాలో పిల్ల‌ల‌కు కోళ్ల ర‌క్తం ఇంజెక్ష‌న్ల‌ను చేయిస్తున్నారు తల్లిదండ్రులు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా కొనసాగుతోంది. ఎందుకిలా చేస్తున్నారు అంటే..

‘Chicken Parenting’ in china : చైనాలో పిల్ల‌ల‌కు కోళ్ల ర‌క్తం ఇంజెక్ష‌న్ల‌ను చేయిస్తున్నారు తల్లిదండ్రులు. చైనాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా కొనసాగుతోంది. ఎందుకిలా చేస్తున్నారు అంటే..భవిష్యత్తులో తమ పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండానట.

Read more: Viagra : వయాగ్రా టాబ్లెట్ ఆత్మహత్య ఆలోచన రానివ్వదా?.. పరిశోధకులు ఏమంటున్నారు?

భ‌విష్య‌త్తులో తమ పిల్లలకు క్యాన్సర్, వ్యంధత్వం (సంతానలేమి), బ‌ట్ట‌త‌ల వంటి స‌మ‌స్య‌లతో పాటు ఇంకా పలు రకాల అనారోగ్యం సమస్యలు రావ‌ని చైనాలో త‌ల్లిదండ్రులు పిల్లలకు కోడి రక్తాన్ని ఇంజెక్ చేయిస్తున్నారు. ఇలా చేయించేవారిలో ఎక్కువగా మ‌ధ్య త‌ర‌గ‌తి చెందిన వారే ఎక్కువ‌గా ఇలా చేస్తున్నార‌ని నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. ముఖ్యంగా షాంఘై,బీజింగ్,గ్వాంగ్ జౌ వంటి నగరాల్లో ఉండే మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లలకు కోడి రక్తం ఇంజెక్షన్లు చేస్తున్నారు.

Read more : WoW‘eBaby’ : వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!!

ఈ చికెన్ రక్తం స్టెరాయిడ్ లు హైపర్ యాక్టివిటీని మెరుగుపరుస్తుందని నమ్ముతున్నారు. ఇది చక్కటి చదువు వంటబట్టటానికి..క్రీడల్లో రాణించటానికి ఉపయోపడుతుందని చెబుతున్నారు.

కాగా చైనాలో యువ‌త చాలా మంది డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నార‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. సుప్‌చైనా మీడియా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2019-20లో మొత్తం యువ‌త‌లో 25 శాతం మంది చైనా యువ‌త డిప్రెష‌న్ బారిన ప‌డ‌గా వారిలో 7.4 శాతం మంది అత్యంత తీవ్ర‌మైన డిప్రెష‌న్‌ను ఎదుర్కొంటున్న‌ట్లు వెల్ల‌డైంది.

ట్రెండింగ్ వార్తలు