Afganistan-China : తాలిబన్ ప్రభుత్వానికి చైనా భారీ సాయం

తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి విదేశీ సాయం చైనా నుంచి అందింది.

Afganistan-China   తాలిబన్ల నేతృత్వంలోని అప్ఘానిస్తాన్ తాత్కాలిక ప్రభుత్వానికి తొలి విదేశీ సాయం చైనా నుంచి అందింది.  అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని తొలి నుంచి సమర్థిస్తూ వస్తున్న చైనా తాజాగా ఆ దేశానికి తొలి విడతగా 31 మిలియన్​ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని అందజేసింది.  ఇందులో భాగంగా శీతాకాలంలో అప్ఘాన్ ప్రజలకు ఉపయోగపడే బ్లాంకెట్లు,జాకెట్లు వంటివి ఆ దేశానికి సరఫరా చేసింది. బుధవారం రాత్రి కాబుల్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ వస్తువులు చేరుకున్నాయి. అప్ఘానిస్తాన్ లో చైనా రాయబారి వాంగ్ యూ, అప్ఘాన్​ ఆపద్ధర్మ ప్రభుత్వంలోని శరణార్థి వ్యవహారాల శాఖ మంత్రి ఖలీల్​ ఉర్​ రెమహాన్​ హక్కానీ కాబూల్ ఎయిర్ పోర్ట్ లో వీటిని అందుకున్నారు.

ఈ సందర్భంగా చైనాకి కృతజ్ఞతలు తెలిపారు అప్ఘాన్ మంత్రి ఖలీల్​ ఉర్​ రెమహాన్​ హక్కానీ. చైనా తమకు మంచి పొరుగుదేశం, మిత్రదేశం అని అన్నారు. భవిష్యత్తులో కూడా తమకు చైనా సాయపడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ సమాజం వివిధ రంగాల్లో తమకు అత్యవసరంగా సాయపడాలని ఆయన అభ్యర్ధించారు.
పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని.. తమ భూభాగం నుంచి ఉగ్రవాద గ్రూపులను ఆపరేట్ చేయడానికి అనుమతించబోమని, అందరినీ కలుపుకుని సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

ఇక, రానున్న రోజుల్లో అప్ఘాన్ కు మరింత సాయాన్ని అందజేస్తామని..ఆహారం సహా ఇతర వస్తువులను అతి త్వరలోనే అప్ఘాన్ కు అందిస్తాం అని అప్ఘాన్ లో చైనా రాయబారి వాంగ్ యూ తెలిపారు.  మరోవైపు,కరవు, పేదరికం వల్ల ఏర్పడిన ఆహార కొరత, శీతాకాలం కారణంగా రానున్న నెలల్లో​ భారీ మానవతా సంక్షోభ ముప్పును అఫ్గాన్​ ఎదుర్కోనుందని ‘రెడ్​ క్రాస్’ సంస్థ హెచ్చరించింది. ​ అప్ఘానిస్తాన్ లో పని చేసేవారికి వేతనాలు చెల్లించకపోవడమే ఈ ముప్పుకు కారణమని రెడ్​క్రాస్​ డైరెక్టర్​ అలెగ్జాండర్​ మాథ్యూ తెలిపారు.

ALSO READ ఫ్రాన్స్ మాజీ అధక్షుడికి ఏడాది జైలు శిక్ష

ట్రెండింగ్ వార్తలు