Kcr : టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొన్నేళ్లు చంద్రబాబు పవర్ లో లేరు.. అంతమాత్రాన ఆయన పార్టీ పోయిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, బలోపేతంగా విస్తరించిన సంస్థను ఎలిమినేట్ చేస్తాం అంటే అది అహంకారం తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పారు. అలా లేకుండా చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. అందులోనూ బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామనేది ఇంపాజిబుల్ అన్నారు కేసీఆర్. లక్ష లేదా కోటి మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఏమీ తేడా ఉండదని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు, ప్రాంతీయ పార్టీల ప్రభావం, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర సహా పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
”వాళ్ల స్వార్ధం కోసం, వాళ్ల పనుల కోసం, వాళ్ల స్వలాభం కోసం. వాళ్ల పైరవీల కోసం పోతున్నారు. అందరూ పోలేదు. బీఆర్ఎస్ ఒక మహా సముద్రం. 60లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ. ఎవరైనా పలానా దాన్ని ఎలిమినేట్ చేస్తాం అంటే తప్పది.. అది అధర్మం. మేము మొన్నటివరకు 10ఏళ్లు అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పవర్ లేదు. మరి కాంగ్రెస్ ఎలిమినేట్ అయ్యిందా? కాదు కదా.. చంద్రబాబు 2004 నుంచి 2014 ఆయన పవర్ లో లేరు. అంత మాత్రాన టీడీపీ లేకుండా పోయిందా? అది భ్రమ. ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, బలోపేతంగా విస్తరించిన సంస్థను ఎలిమినేట్ చేస్తాం అంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది అసాధ్యం. అందులోనూ బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామనేది ఇంపాజిబుల్. లక్ష మంది రేవంత్ రెడ్డిలు లేదా కోటి మంది వచ్చినా ఏమీ తేడా ఉండదు.
కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు ఎమోషన్. దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ ఎమోషనల్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ను తుడిచిపడేస్తాం అని ఎవరైనా అనుకుంటే.. వాడు పిచ్చోడు అవుతాడు.
నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించా. ఒకే విడతలో చేద్దామని నేను చాలా ప్రయత్నం చేశా. కానీ, అది అసాధ్యం. జరిగే పని కాదు. అందుకే కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోసం చేశారని ప్రజలకు చెప్పా. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. అది అయ్యే పని కాదు. నెక్ట్స్ రైతు భరోసా ఇవ్వాలి. నాలుగు విడతల డీఏ ఎప్పుడు విడుదల చేయాలి? ఉద్యోగులు 51శాతం ఫిట్ మెంట్ అడుగుతున్నారు. మళ్లీ 40వేల కోట్ల రుణమాఫీ చేయాలి. ఎక్కడి నుంచి చేస్తారు. అంతా ఒట్టిదే. జరిగే పని కాదు” అని కేసీఆర్ అన్నారు.
Also Read : తడాఖా చూపిస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు: కేసీఆర్