తడాఖా చూపిస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు: కేసీఆర్
న్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, దీనికే ఏదోక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.

KCR Press Meet: పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని, తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో శనివారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల కూటమే దేశాన్ని శాసించనుందని చెప్పారు. ఎన్నికల తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడుతుందని, దీనికే ఏదోక జాతీయ పార్టీ మద్దతు ఇస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ప్రకటించారు.
తెలంగాణలో బీజేపీకి ఒన్ ఆర్ నన్ పరిస్థితి ఉందని, దక్షిణాదిలో 10 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. ఉత్తర భారతంలోనూ కాషాయ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉంటుందని అన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. బీజేపీతో రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు సంపాదించడం బీజేపీకి అలవాటన్నారు.
Also Read: రేవంత్ జీవితమే కరప్షన్.. 100 రోజుల్లోనే ఆయన ఏంటో అర్థమైంది: మోత్కుపల్లి
బీఆర్ఎస్ పేరు మార్చబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని.. ఏ ఆగస్టో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.