China Covid : చైనాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాలు పెరుగుతాయి

కరోనా పుట్టిల్లైన చైనాలో కోవిడ్ కేసులను జీరో స్ధాయికి తీసుకు  రావటానికి ఆదేశం నానా అగచాట్లు పడుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతున్నా కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

China Covid :  కరోనా పుట్టిల్లైన చైనాలో కోవిడ్ కేసులను జీరో స్ధాయికి తీసుకు  రావటానికి ఆదేశం నానా అగచాట్లు పడుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవుతున్నా కఠిన ఆంక్షలు విధిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. చైనా అమలు చేస్తున్న ఆంక్షలతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పుడు గనుక చైనా తన దీర్ఘకాలిక వ్యూహాన్ని విడిచి పెడితే ఒమిక్రాన్ వేరియంట్ సునామీలా విజృంభిస్తుందని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. దాని ఫలితంగా 16 లక్షల మరణాలు నమోదవుతాయని అంచనా వేశారు. ఈ అధ్యయనం నేచర్ జర్నల్‌లో ప్రచురించబడింది.

చైనీయులు వేసుకున్న వ్యాక్సిన్లలోని రోగ నిరోధక స్ధాయిలు ఒమిక్రాన్‌ను తట్టుకోలేవని ఆ అధ్యయనం పేర్కోంది. వ్యాక్సిన్ తీసుకున్న వృధ్ధుల సంఖ్య తక్కువగా ఉండటం… మెరుగైన ఫలితాలు ఇవ్వని టీకాల పై ఆధార పడటం ఇందుకు కారణంగా అందులో పేర్కోన్నారు. ఇలాంటి సమయంలో మాస్ టెస్టింగ్‌లు, కఠినమైన లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయకపోతే చైనాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

దాని వల్ల 112.2 మిలియన్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉన్నట్లు ఆ నివేదిక అంచనా వేసింది. వారందరిలో వ్యాధి లక్షణాలు కనిపించనున్నాయి. వారిలో 5.1 మిలియన్ల మంది ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్ధితి రావచ్చు. 1.6 మిలియన్ మంది మృత్యువాత పడే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కోంది. చైనాలో అమలు చేస్తున్న కోవిడ్ జీరో వ్యూహంపై ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రపంచ దేశాలలో నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. మరోసారి వైరస్ వ్యాప్తి చెందితే తట్టుకునేలా తమ జీవన విధానాన్ని
మార్చుకుంటున్నారు. కానీ చైనా కోవిడ్ కేసులను సున్నా స్ధాయికి తీసుకు వచ్చేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ ప్రజలను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఒకసారి ఈ విధానంపై పునరాలోచించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిపతి టెడ్రోస్ అథనామ్ చైనాకు విజ్ఞప్తి చేశారు.

Also Read : Cyclone Asani Continues : ఏపీపై అసని తుపాను ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

ట్రెండింగ్ వార్తలు