Expensive Teapot : వామ్మో..ఒక్క ఈ టీ పాట్ ధర రూ.24 కోట్లు ..

ఓ టీ పాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు..అంటే దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. అందుకే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.

World most Expensive Teapot

World most Expensive Teapot : అదో టీ పాట్. చూస్తేనే కాదు దాని ధర వింటే కళ్లు జిగేల్ మని అంటాయి. ఎందుకంటే దాని ధర ఆ రేంజ్ లో ఉంది. సాధారణంగా టీ పాట్స్ అంటే పింగాణీవి ఉంటాయి. వాటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. చైనా పింగాణికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి చైనా పింగాణీతో తయారైన టీపాట్ అయితే రూ.వేలల్లో ఉంటుందని అనుకుందాం…కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ పాట్ ధర రూ.వేలు కాదు లక్షలు కూడా కాదు ఏకంగా కోట్లల్లో ఉంది.

ఈ టీ పాట్ ధర అక్షరాల రూ.24 కోట్లు.. ఏంటీ షాక్ అయ్యారా..? అయ్యే ఉంటార్లెండి..ధర ఆరేంజ్ లో ఉంది. మరి ఇక దీని ధరే కల్లు చెదిరేలా ఉందంటే దీన్ని చూస్తే కళ్లు నిజంగానే జిగేల్ మని అంటాయి. ఎందుకంటే దాని స్పెషాలిటీ అలాంటిది. ఎందుకంటే వందల కొద్దీ వజ్రాలు పొదిగారు ఈ టీపాట్ లో. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఈ టీ పాట్ కు 1658 వజ్రాలు పొదిగారు.

Sandwich: శాండ్‌విచ్‌ను కట్ చేసినందుకు కూడా బిల్ వేసిన రెస్టారెంట్ .. ప్రశ్నించిన కష్టమర్‌కు డబుల్ షాకులు

అందుకే దీనికి అంతటి ధర. దీంతో ఈ టీపాట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టీపాట్ గా క్రెడిట్ కొట్టేసింది. అంత్యంత కళాత్మకతను, చరిత్రకు చిహ్నంగా ఈ టీపాట్ నిలిచింది. 2016 నుంచి దీనికి విశేషమైన రికార్డు ఉంది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏదీ బ్రేక్ చేయలేదు. 18క్యారెట్ల బంగారంతో.. 1658 వజ్రాలు పొదగబడిన ఈ టీపాట్ లో 6.67 క్యారెట్ల రూబీలను కూడా అమర్చారు. దీంతో ధర అక్షరాల రూ.24 కోట్లు..దీంతో ఇది గిన్నిస్ రికార్డు(Guinness World Records)ను కొల్లగొట్టింది. ఈ టీపాట్ గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వజ్రాలతో ధగధగా మెరిసిపోయే ఈ పాట్ తెగ వైరల్ అవుతోంది.

ఈ టీకప్పును యూకేకు చెందిన  ఎన్ సేతియా ఫౌండేషన్( N Sethia Foundation), న్యూబీ టీస్ ఆఫ్ లండన్ (Newby Teas of London)సహకారంతో రూపొందించారు. ఇటాలియన్ జ్యుయలర్ ఫుల్వియో స్కావియా దీన్ని తయారు చేశారు. 2016లో ప్రపంచ రికార్డు అందుకుంది. ఈ టీ కప్పులో 1658 వజ్రాలు,18 క్యారెట్ల బంగారం,386 థాయ్, బర్మీస్ రూబీలు ఒదిగిపోయాయి. ఈ వివరాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ట్విట్టర్ పేజీలో ఈ నెల 9న పోస్ట్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు