Sandwich: శాండ్‌విచ్‌ను కట్ చేసినందుకు కూడా బిల్ వేసిన రెస్టారెంట్ .. ప్రశ్నించిన కష్టమర్‌కు డబుల్ షాకులు

హోటల్ కు వెళ్లి భోజనానికి ఆర్డర్ ఇస్తే భోజనానికి మాత్రమే బిల్ వేస్తారు. కానీ కూరగాయాలు కట్ చేసినందుకు..ఎక్స్ ట్రా ప్లేట్ ఇచ్చినందుకు కూడా బిల్ వేస్తారా..? అంటే మా దగ్గర అంతే అంటోంది ఓ వింత రెస్టారెంట్. అక్కడికెళితే బాదుడే బాదుడు తప్పదట..

italian cafe sandwich cutting two pieces charge

italian cafe sandwich cutting two pieces charge : అదో బాదుడు రెస్టారెంట్ అక్కడికెళితే వింత వింత చార్జీలు వేసి మరీ కష్టమర్లను బాదేస్తున్నారంటూ ఓ వ్యక్తి వాపోయాడు. అతని బాధకో కారణం ఉంది. పాపం ఓ రెస్టారెంట్ కు వెళ్లి సాండ్ విచ్ ఆర్డర్ చేశాడు. దాన్ని కట్ చేసి ఇవ్వమని కోరాడు.అతను అడిగినట్లుగా రెండు పీసులుగా కట్ చేసిన సర్వ్ చేశారు. ఆనక బిల్లులో మత్రం సాండ్ విచ్ కట్ చేసినందుకు కూడా సెపరేట్ గా చార్జ్ వేయటంతో సదరు కష్టమర్ తెల్లబోయాడు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యాన్ని అదే విషయంగా ప్రశ్నిస్తే అతను చెప్పిన సమాధానానికి మరింత తెల్లబోయాడు. దీంతో ఇదేం రెస్టారెంట్ రా బాబూ..చార్జీ బాదుడుతో పాటు ఇవేం సమాధానాలు అంతూ తెల్లబోయాడు. తనకు ఎదురైన ఈ వింత ఘటనపై సోషల్ మీడియో షేర్ చేస్తు వాపోయాడు..

Minister Temjen : వావ్ .. వెదురుబొంగుతో వాష్ బేషిన్, ఊరందరికి ఒక్కటే..

ఇటలీ(Italy)లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమో ( Lake Como)సమీపంలో గెరా లారియో అనే ఓ హాలిడే స్పాట్ ఉంది. అక్కడ బార్ పేస్ (Bar Pace)అనే ఓ రెస్టారెంట్ ఉంది. పర్యాటక ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్స్ అంటే కాస్త కాస్ట్ ఎక్కువే ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ ఈ రెస్టారెంట్ మాత్రం మరీ వెరైటీగా ఉంది… బార్ పేస్ రెస్టారెంట్ కు వెళ్లిన ఓ వ్యక్తి శాండ్‌విచ్‌ (sandwich )ఆర్డర్ చేశాడు. దాన్ని రెండు పీసులుగా చేసి ఇవ్వాలని కోరాడు. అన్నట్లుగా రెండు ముక్కలుగా చేసి సర్వ్ చేశాడు సర్వర్. తీరా తిన్న తర్వాత బిల్లు చూసిన అతను షాక్ అయ్యాడు.

అతను శాండ్‌విచ్‌ను రెండు పీసులుగా చేసినందుకు కూడా చార్జీ విధించారు. శాండ్ విచ్ ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే చార్జీ 7.50 యూరోలు. దీనికి కట్ చేసినందుకు 2 యూరోలు బిల్ వేశారు. ఒక యూరో భారత కరెన్సీలో రూ.90. అంటే రెండు పీసులు చేసినందుకు రూ.180 బిల్ వేశారు. అలాగే కాఫీకి 1.20 యూరోలే. అంటే కాఫీ కంటే చాకుతో రెండు ముక్కలు చేసిచ్చినందుకు రెస్టారెంట్ రెట్టింపు చార్జీలతో బాదేసింది.

Rajasthan Court : 11ఏళ్లనాటి కేసు .. సాక్ష్యం కోసం కోర్టుకు గేదె

అది చూసి షాక్ అయిన సదరు కష్టమర్ రెస్టారెంట్ యజమాని క్రిస్టినా బైచిని ప్రశ్నించాడు. దానికి అతను కష్టమర్ చేసే రిక్వెస్టును (Additional request)బట్టి చార్జీలు ఉంటాయని..‘‘ సాండ్ విచ్ ను రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. అంటే తాము రెండు ప్లేట్లు కడుక్కోవాలి. దానికి పట్టే టైమ్, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో పాపం సదరు కష్టమర్ కు ఫలితంగా డబుల్ షాకులు..ఇదేం బాదుడురా బాబూ..పైగా ఇటువంటి సమాధానాలు ఎక్కడా వినలేదు అంటూ తల పట్టుకున్నాడు. కానీ ఏం చేయగలడు..బిల్ కట్టాల్సి వచ్చింది..

 

 

ట్రెండింగ్ వార్తలు