Rajasthan Court : 11 ఏళ్ల నాటి కేసు.. సాక్ష్యం కోసం కోర్టుకు గేదె.. తర్వాత ఏం జరిగిందంటే..

11 ఏళ్ల నాటి కేసు విచారణ కోసం ఓ గేదెను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టుకు గేదెను తీసుకురావటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajasthan Court

Buffalo to court as evidence : రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని కోర్టులో ఓ విచిత్రమైన సన్నివేశం చోటుచేసుకుంది.11 ఏళ్ల నాటి కోసులో సాక్ష్యం కోసం ఓగేదెను సాక్ష్యంగా తీసుకొచ్చిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో ఏకంగా గుడిలో శివలింగాన్నే కోర్టుకు తీసుకొచ్చిన ఘటన చోటుచేసుకుంది. ఆ పరమశివుడికి కూడా తప్పలేదా కోర్టు కష్టాలు అంటూ అప్పట్లో ఆ వార్త తెగ వైరల్ అయ్యింది. రీసెంట్ గా కోర్టుకు గేదెను సాక్ష్యంగా తీసుకొచ్చిన ఘటన ట్రెండ్ అవుతోంది. మరి ఏంటీ గేదె కేసు కధా కమామీషు అంటే.. Buffalo to court as evidence

జైపూర్ జిల్లాలో చౌము అనే ఓ టౌనులో 11 ఏళ్ల క్రితం మూడు గేదెలు చోరీ అయ్యాయి. దీంతో గేదెల యజమాని హర్మదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  గేదెల కోసం గాలించారు. ఎట్టకేలకు రెండు గేదెల్ని పట్టుకున్నారు. వాటిని యజమాని చరణ్ సింగ్ సెరవాత్ కు అప్పగించారు. ఈకేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరైన అర్షద్ మియాకు చెందిన భరత్ పూర్ ని అరెస్ట్ చేశారు. నిందితుడుని కేసు వివరాలను కోర్టులో హాజరుపచటం అనంతరం అనికి బెయిల్ రావటం జరిగింది. ఈ రెండు గేదెల్లో ఓ గేదె కొన్నేళ్ల క్రితం మరణించింది.

No Confidence Motion: ఆవులు, గేదెల్ని కూడా లెక్కిస్తారు, మా లెక్కలు ఒద్దా? ఆర్ఎస్ఎస్ పేరు ప్రస్తావిస్తూ జేడీయూ నేత ఫైర్

ఈ కేసు విచారణ కొనసాగుతునే ఉంది. కేసు విచారణలో భాగంగా సాక్షులు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకోవడం కోసం కోర్టుకు హాజరు కావాలని గేదను కూడా తీసుకురావాలని  ఇటీవలే సమన్లు అందాయి. దీంతో కేసు విచారణ రోజున సాక్షులతోపాటు గేదెను కూడా కోర్టుకు తీసుకువచ్చారు. సాక్షి సుభాష్ చౌదరి గేదెను గుర్తించారు. ఈక్రమంలో గేదెను కోర్టుకు తీసుకురావడంతో కోర్టులో ఆసక్తికర చర్చ మొదలైంది.

కాగా ఈ కేసులో గేదెలను దొంగిలించారనే ఆరోపణలో నిందితులు  తరపు న్యాయవాది అజయ్ శర్మ మాట్లాడతు..2012లో జులై 26న చరణ్ సింగ్ సెరావత్ అనే వ్యక్తి తన క్లైంట్స్ పై కేసు పెట్టారని..ఈ కేసులో ఫిర్యాదుదారుని దొంగిలించబడిన గేదెను గుర్తించాలని కోర్టుకు పిలిపించారని తెలిపారు.

ఈకేసులో మొత్తం 21మంది సాక్షులను అప్పటి సిటీ పోలీసు ఇన్ చార్జ్ హీరాలాల్ సైనీ, ఫిర్యాదు చేసిన చర్ణ్ సింగ్ సహా ఐదుగురి వాంగ్ములాలను నమోదు చేశారు. ఈకేసులో విచారణ కొనసాగుతుండగా గేదెను గుర్తించిన తరువాత కేసు విచారణను 2023 సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. తదుపరి విచారణకు సాక్ష్యుల్ని ప్రవేశ పెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.

 

ట్రెండింగ్ వార్తలు