Viral Video: విడాకులు వచ్చాయోచ్ అంటూ పార్టీ ఇచ్చి అదిరిపోయే స్టెప్పులు వేసిన యువతి

బాలీవుడ్ పాటలు షీలా కీ జవానీ, సోనా కిత్నా సోనా హైకు ఆమె చేసిన డ్యాన్స్..

విడాకులు తీసుకుంటే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చునే రోజులు పోయాయ్. బర్త్ డే వంటి వేడుకలకు ఎలా పార్టీలు ఇస్తారో అలాగే విడాకులు వచ్చిన సందర్భంగానూ పార్టీలు ఇస్తూ హుషారుగా దీన్నీ జరుపుకుంటున్నారు కొందరు. తాజాగా, ఓ పాకిస్థాన్ యువతికి ఆమె భర్త నుంచి విడాకులు మంజూరయ్యాయి.

దీంతో పట్టరాని సంతోషంతో ఆమె గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. ఎన్నడూ లేనంత హుషారుగా కనపడింది. పార్టీలో డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. బాలీవుడ్ పాటలు షీలా కీ జవానీ, సోనా కిత్నా సోనా హైకు ఆమె చేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డైవర్స్ ముబారక్ పేరిట ఆమె ఈ పార్టీ ఇచ్చింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నట్లు చెప్పింది. ఆమె తీరు సంప్రదాయవాదులకు మాత్రం నచ్చలేదు. విడాకులు తీసుకోవడమే తప్పంటే దాన్ని వేడుకగా జరుపుకోవడం ఏంటని అంటున్నారు. ప్రపంచం ఎటుపోతోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ముంబై భారీ వర్షంలో తిరిగిన మార్వెల్ సూపర్ హీరోలు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు