మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై నిర్మలా సీతారామన్ కౌంటర్

మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారని, తామంతా ఆమె ప్రసంగాన్ని..

Nirmala Sitharaman: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమత వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. సమావేశంలో తాను మాట్లాడుతున్న సమయంలో మధ్యలో మైక్ కట్ చేశారని ఆమె అన్నారు.

దీనిపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారని, తామంతా ఆమె ప్రసంగాన్ని విన్నామని తెలిపారు. ప్రతి సీఎంకు కేటాయించిన సమయంలోగా ప్రసంగించాలని చెప్పారు. ప్రతి టేబుల్ ముందు ఉన్న స్క్రీన్‌పై ఎంత సమయం ప్రసంగించాలో ఉందని వివరించారు.

మమత ఆమె మైక్‌ను కట్ చేశారని చెప్పడం అబద్ధమని నిర్మలా సీతారామన్ అన్నారు. మమత బెనర్జీ నిజాలు మాట్లాడాలని చెప్పారు. ఆమె నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన మైక్ చేశారని చెప్పడం బాధాకరమని చెప్పారు. కేటాయించిన సమయం అయిపోతున్న సమయంలో దాన్ని పొడిగించాలని అడగకుండా దానిని సాకుగా చూపి తన మైక్ ఆఫ్ చేశారని చెప్పారని అన్నారు. మీడియాకి నిజాలు చెప్పాలని వ్యాఖ్యానించారు.

Also Read: ఆ ప్రాంతంలో రోడ్లపై అమ్మాయిలను వేధిస్తున్న యువకులు.. చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశం

ట్రెండింగ్ వార్తలు