Fuel Prices Come Down : దేశంలో ఇంధన ధరలు ఎలా తగ్గుతాయి? నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే?

Fuel Prices Come Down : వినియోగదారులు రెండుసార్లు పన్ను చెల్లించాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకసారి కేంద్రానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను వర్తిస్తుంది.

How Can Fuel Prices Come Down ( Image Source : Google )

Fuel Prices Come Down : దేశంలో ఇంధన ధరలు త్వరలో తగ్గనున్నాయా? తాజాగా కేంద్ర ఆర్థిక మంద్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే విషయంపై ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించి తగిన రేటును నిర్ణయిస్తే.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) కన్నా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) కింద పన్ను విధించవచ్చునని నిర్మలా సీతారామన్ ఎన్డీటీవీతో అన్నారు.

Read Also :Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!

“రాష్ట్రాలు ఇంధన ధరల రేటును నిర్ణయించి, అందరూ కలిసికట్టుగా ఉంటే.. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే.. కేంద్రం వెంటనే దాన్ని అమలు చేయవచ్చు” అని ఆమె చెప్పారు. అదేగానీ జరిగితే ఇంధన ధరలలో తగ్గుదలని చూడవచ్చు.

జీఎస్టీ పరిధిలోకి వస్తే.. ఒకే విధమైన పన్ను :
ఎందుకంటే.. వీటికి ఇతర లెవీలు కాకుండా ఒక్కసారి మాత్రమే పన్ను విధిస్తారు. అంటే.. ఉత్పత్తి ధరపై మాత్రమే కాకుండా కేంద్రం ఎక్సైజ్‌పై కూడా ఉంటుంది. ప్రస్తుతం, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. ఎందుకంటే.. ఒక్కోదానికి ఒక్కో పన్ను ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ సుంకం దీనిపైన విధిస్తుంటుంది.

అంతిమంగా వినియోగదారులు రెండుసార్లు పన్ను చెల్లించాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, మరొకసారి కేంద్రానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను వర్తిస్తుంది. సిద్ధాంతపరంగా ఇంధన ధరలను తగ్గించడానికి వీలుపడుతుంది.

ఇంధన ధరలపై తుది నిర్ణయం రాష్ట్రాలదే :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకారం.. పెట్రోలియం ఉత్పత్తులపై దాదాపు 60 శాతం పన్ను విధిస్తుంది. రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్లు, కేంద్రం రూ. 2 లక్షల కోట్లను ఆర్జించింది. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఈ ఉత్పత్తులపై గరిష్టంగా 28 శాతం పన్ను స్లాబ్ ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుత పన్ను విధానంలో అత్యధిక స్లాబ్. నవంబర్ 2022 నాటికి కేంద్రం ఈ చర్యకు సిద్ధంగా ఉందని స్పష్టంచేసింది. కానీ, ఇంధన ధరలపై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రాలకే వదిలివేసింది.

అప్పటి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న కేంద్ర మంత్రి హర్దీప్ పూరి.. రాష్ట్రాలు తరలివస్తే మేం సిద్ధంగా ఉన్నాం.. అంతా సిద్ధంగానే ఉన్నామన్నారు. అయినప్పటికీ, అన్ని రాష్ట్రాలు ఈ ఆలోచనతో ఉండవు. ఎందుకంటే.. దీనికారణంగా ఆయా రాష్ట్రాలు గణనీయమైన ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి, 2021 డిసెంబర్‌లో పెట్రోలియం ఉత్పత్తులను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేయలేదు.

Read Also : School Van Driver : ప్రాణాలను వదిలే ముందు.. 20 మంది పిల్లల్ని కాపాడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్!

ట్రెండింగ్ వార్తలు