వెళ్లొద్దని గుండెలు పగిలేలా ఏడ్చిన తల్లి.. కన్న తల్లిదండ్రులను ప్రియుడి కోసం వదిలేస్తానంటున్న అమ్మాయి.. వీడియో చూస్తారా?

ఆ కూతురి ముఖంలో మాత్రం తల్లి పట్ల కనీసం జాలి కూడా కనిపించలేదు. ప్రియుడితో కలిసి జీవించేందుకు తన కుటుంబాన్ని వదిలి వెళ్తానని ఆ యువతి పట్టుబట్టింది.

వెళ్లొద్దని గుండెలు పగిలేలా ఏడ్చిన తల్లి.. కన్న తల్లిదండ్రులను ప్రియుడి కోసం వదిలేస్తానంటున్న అమ్మాయి.. వీడియో చూస్తారా?

Updated On : October 13, 2025 / 5:48 PM IST

Viral Video: ఇన్నాళ్లు తనను కంటికి రెప్పలా కాపాడుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి పెంచిన తల్లిదండ్రులతో ఇక తనకు అవసరం లేదనుకుంది ఓ అమ్మాయి. కొత్తగా పరిచయం అయిన యువకుడితో వెళ్లిపోతానని గొడవ పెట్టుకుంటోంది.

ఆమెకు అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ప్రేమించిన ఆ అబ్బాయితోనే వెళ్లిపోతానని అంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌, జోధ్‌పూర్ (Jodhpur) సమీపంలోని ఓసియాన్ (Osian) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సామ్రావు (Samrau) గ్రామ పంచాయతీ పరిధిలో ఓ తల్లి తన కూతురు ముందు గుండెలు పగిలేలా ఏడుస్తూ, దయచేసి తనను విడిచి వెళ్లవద్దని ప్రాధేయపడుతుంది.

కానీ, ఆ కూతురి ముఖంలో మాత్రం తల్లి పట్ల కనీసం జాలి కూడా కనిపించలేదు. ప్రియుడితో కలిసి జీవించేందుకు తన కుటుంబాన్ని వదిలి వెళ్తానని ఆ యువతి పట్టుబట్టింది. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు నెటిజన్లను కలచివేస్తోంది.

కుటుంబం ఆవేదన.. యువతి పంతం
తాము తమ కూతురిని ఎంతో ప్రేమగా పెంచి, అన్ని సౌకర్యాలను కల్పించి, మంచి చదువు చెప్పించామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, ఇప్పుడు ఓ యువకుడి మోజులో పడి తమను వదిలి వెళ్లిపోతానని మొండిగా చెబుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చడంతో, చివరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.

సబ్-డివిజనల్ అధికారి రామ్ నివాస్ మెహతా, పోలీసు అధికారి రాజేంద్ర చౌదరి ఈ వివాదంలో కలుగజేసుకున్నారు. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. యువతి భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఆమెను ‘నారీ నికేతన్’ (మహిళా ఆశ్రమం)కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులు ఇరుపక్షాలకు సలహా ఇచ్చి, పరిస్థితిని శాంతింపజేయడానికి కృషి చేశారు.

తాము తమ కూతురిని ఎంతో గారాబంగా పెంచామని, ఆమె కోరినవన్నీ సమకూర్చామని తల్లిదండ్రులు అధికారులకు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించాలనుకుంటుందని పేర్కొన్నారు. అయితే, తల్లిదండ్రులు తీసుకునే ఏ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తాను కోరుకోవడం లేదని యువతి చెప్పింది. ఈ పరిణామం ఆ కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.

పరిష్కారం కోసం ప్రయత్నాలు
కూతురు, తల్లిదండ్రులు ఈ విషయంలో సరైన రీతిలో మాట్లాడుకోకపోవడంతోనే పరిస్థితి ఇంత క్లిష్టంగా మారిందని గ్రామస్తులు అంటున్నారు. ప్రస్తుతం యువతి ‘నారీ నికేతన్’లో సురక్షితంగా ఉంది. కుటుంబం, యువతి మధ్య రాజీ కుదిర్చేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.