Tamil Nadu : మహిళలకు గుండు కొట్టించిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. నిందితుడు చెప్పిన మాటలతో కంగుతిన్న పోలీసులు..
Tamil Nadu Women Head Shaving Incident : తమిళనాడులో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలకు గుండు కొట్టించిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Tamil Nadu Women Head Shaving Incident
- తమిళనాడులో విచిత్ర ఘటన
- కొత్త పథకం అంటూ మహిళలకు గుండు కొట్టించిన వ్యక్తి
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Tamil Nadu Women Head Shaving Incident : తమిళనాడులో ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళలకు గుండు కొట్టించిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రభుత్వం కొత్త పథకం కింద రూ. 15వేలు ఇస్తుంది.. అందుకోసం గుండు గీయించుకోవాలని చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను అరియాలూరు జిల్లాకు చెందిన సతీష్ కుమార్‌గా గుర్తించారు. అయితే, మహిళల గుండు గీయించే స్కీం గురించి అతను చెప్పిన మాటలతో పోలీసులు సైతం కంగుతిన్నారు.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ భారీ శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5వేలు జమ..
పోలీసుల కథనం ప్రకారం.. అరియలూరు జిల్లాకు చెందిన సతీష్ కుమార్ తనను తాను తహసీల్దార్‌గా పరిచయం చేసుకుని గ్రామంలోని మహిళలకు ఫోన్ చేశాడు. కరోనా తరహాలో ప్రపంచ వ్యాప్తంగా కొత్త వైరస్ వస్తుందని.. ఈ అంటువ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తోందని, తలకు గుండు చేయించుకుంటే వ్యాధి రాదని, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని నమ్మించాడు. గుండు చేయించుకున్న కొత్త ప్రభుత్వం కింద మహిళలకు తమిళనాడు ప్రభుత్వం రూ.15 వేల నగదు, పురుషులకు రూ.6 వేలు, విద్యార్థులకు రూ.45 వేలతో పాటు ల్యాప్‌టాప్ ఇస్తుందని నమ్మించాడు.
వాట్సాప్ ద్వారా గుండు చేయించుకున్న ఫొటోలు పంపిస్తే వారికి డబ్బులు ఇస్తున్నట్లుగా నకిలీ ఫొటోలు కూడా పంపించాడు. సతీష్ కుమార్ మాటలను నమ్మిన స్థానికులు.. సుమారు 20 మంది గుండు చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే తొలుత ముగ్గురు మహిళలు మాత్రమే వెంటనే గుండు చేయించుకున్నారు. తర్వాత డబ్బుల కోసం నిందితుడిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో తాము మోసపోయామని మహిళలు గుర్తించారు. దీంతో వారు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు అత్తూర్ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. మహిళలపై మోసం చేసిన కేసుతో పాటు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
పోలీసుల విచారణలో.. సోషల్ మీడియాలో మహిళలు గుండు చేయించుకున్న వీడియోలు చూసి, అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో.. కేవలం ఆటపట్టించాలనే కారణంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు ఫోన్ కాల్స్, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు.
