School Van Driver : ప్రాణాలను వదిలే ముందు.. 20 మంది పిల్లల్ని కాపాడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్!

School Van Driver : 49ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. రోడ్డు పక్కనే సురక్షితంగా వ్యాన్ ఆపాడు. సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను రక్షించిన వెంటనే తాను ప్రాణాలను వదిలాడు.

School Van Driver : ప్రాణాలను వదిలే ముందు.. 20 మంది పిల్లల్ని కాపాడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్!

Tamil Nadu school van driver saves 20 kids moments ( Image Source : Google )

School Van Driver : మృత్యువు ఎవరిని ఎటువైపు నుంచి కబలిస్తుందో చెప్పలేం.. ఏ క్షణమైనా అది సంభవించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఎవరూ చేయలేని సాహసం చేశాడు. స్కూల్ వ్యాన్ డ్రైవ్ చేస్తుండగా ఒక్కసారిగా అతడికి గుండెపోటు వచ్చింది.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

అయినప్పటికీ, తాను భయాందోళన చెందకుండా ఒకవైపు ప్రాణాలను కోల్పోతున్నా 20 మంది స్కూల్ పిల్లల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుప్పూర్ జిల్లాలో 49ఏళ్ల స్కూల్ బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. రోడ్డు పక్కనే సురక్షితంగా వ్యాన్ ఆపాడు. సుమారు 20 మంది విద్యార్థుల ప్రాణాలను రక్షించిన వెంటనే తాను ప్రాణాలను వదిలాడు.

అది గమనించిన అక్కడి స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ డ్రైవర్ ప్రాణాలను వదిలినట్టు వైద్యులు వెల్లడించారు. ఒకవైపు తాను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడ్రైవర్ చేసిన సాహసానికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. సెమలయ్యప్పన్ స్కూల్ పిల్లలతో కలిసి డ్రైవర్ సీటుపై అపస్మారక స్థితిలో కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన జూలై 24, బుధవారం, వెల్లకోయిల్‌లోని ఏఎన్‌వీ మెట్రిక్ స్కూల్ నుంచి విద్యార్థులను వారి ఇళ్ల వద్ద దింపడానికి సెమలయ్యప్పన్ తీసుకువెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఛాతిలో నొప్పి రావడంతో అతి కష్టం మీద వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపాడు.

డ్రైవర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం :
అతని భార్య కూడా అదే స్కూల్‌లో హెల్పర్‌గా పనిచేస్తుండగా.. అతడు కుప్పకూలినప్పుడు వ్యాన్‌లో ఉండడం గమనార్హం. మృత్యువు అంచున ఉన్నా తాను చిన్నారుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్‌ వీరోచిత చర్యను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ సహా పలువురు కొనియాడారు. “తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ.. పాఠశాల విద్యార్థుల విలువైన ప్రాణాలను కాపాడాడు. అతని కర్తవ్య భావం, ఆత్మబలిదానాలకు ఆయనకు నమస్కరిస్తున్నాం. తాను భౌతికంగా చనిపోయినా అందరి హృదయాల్లో జీవించే ఉంటాడు” అని స్టాలిన్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెమలయ్యప్పన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే మంత్రి ఎంపీ సామినాథన్‌ మృతుల కుటుంబాలకు చెక్కును అందజేశారు. వ్యాన్ డ్రైవర్‌కు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ కూడా కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు.

Read Also : Apple iPhone Prices : ఆపిల్ లవర్స్‌కు పండగే.. దిగొచ్చిన ఐఫోన్ల ధరలు.. ప్రో మోడల్స్‌పై ఫస్ట్ టైం తగ్గింపు..!