Maharashtra: నవీ ముంబైలో విషాదం.. కుప్పకూలిన మూడంతస్తుల భవనం..
నవీ ముంబైలో విషాదం చోటు చేసుకుంది. షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని..
- Harish Thanniru
- Published on- July 27, 2024 / 08:54 AM IST
building collapses in Navi Mumbai
building collapses in Navi Mumbai : నవీ ముంబైలో విషాదం చోటు చేసుకుంది. షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శనివారం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే తెలిపారు. కుప్పకూలిన భవనం జీప్లస్3 భవనం. ఇందులో 13ప్లాట్లు ఉన్నాయి.
Also Read : Olympics 2024 : హాలీవుడ్ అందాలు, ఈఫిల్ టవర్‌పై లైట్ షో.. ఒలింపిక్ ఆరంభ వేడుకలు అదుర్స్.. వీడియోలు వైరల్
భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కూలిన భవనం 10ఏళ్ల నాటి భవనమని, ఈ ఘటనపై విచారణ జరుగుతుందని కమిషనర్ తెలిపారు. భవన యాజమానిపైనా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ఇదిలాఉంటే.. గత వారం రోజుల నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ భవనం కూలిపోవడానికి కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు దృష్టిసారించారు.
Also Read : US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు.. ఎక్స్‌లో వెల్లడి ..
