Olympics 2024 : హాలీవుడ్ అందాలు, ఈఫిల్ టవర్‌పై లైట్ షో.. ఒలింపిక్ ఆరంభ వేడుకలు అదుర్స్.. వీడియోలు వైరల్

భారత్ 84వ దేశంగా వచ్చింది. పివి సింధు, ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత్, ఇండోనేషియా, ఇరాన్‌లకు చెందిన ఒలింపిక్‌ జట్లు ఒకే బోట్‌లో వచ్చాయి.

Olympics 2024 : హాలీవుడ్ అందాలు, ఈఫిల్ టవర్‌పై లైట్ షో.. ఒలింపిక్ ఆరంభ వేడుకలు అదుర్స్.. వీడియోలు వైరల్

Olympics 2024

Olympics 2024 Opening Ceremony Highlights : పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన సంబరాలు చిరస్మరణీయం. నదిపై జరిగిన ఆరు కిలో మీటర్ల పరేడ్ లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు 3.20లక్షల మందికిపైగా ప్రేక్షకులు తరలివచ్చారు. దీంతో ఒలింపిక్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ఆరంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒలింపిక్స్ -2024 ప్రారంభ వేడుకలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11గంటలకు ప్రారంభమయ్యాయి.

Also Read : Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న తెలుగు తేజాలు వీరే.. లిస్ట్‌లో 8 మంది

ఒలింపిక్స్ -2024 క్రీడలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈఫిల్ టవర్ వద్ద అందమైన లైట్ షో కనువిందు చేసింది. చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన లైట్ షోను ప్రేక్షకులు ఆస్వాదించారు. చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ తరువాత నీటి తెరలను చీల్చకుంటూ మొదట గ్రీస్ బృందం పరేడ్ లో పాల్గొంది. అనంతరం శరణార్థి బృందం వచ్చింది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్ లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ వచ్చింది. పరేడ్ సాగుతున్నప్పుడే పాప్ సింగర్ లేడీ గాగా ప్రదర్శనతో అలరించింది. నదికి రెండు వైపులా కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

 

భారత జట్టు 84వ దేశంగా వచ్చింది. పివి సింధు, ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత్, ఇండోనేషియా, ఇరాన్‌లకు చెందిన ఒలింపిక్‌ జట్లు ఒకే బోట్‌లో వచ్చాయి.