Bengaluru Traffic : బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు.. కారులో కన్నా నడిస్తేనే వేగంగా వెళ్లొచ్చు.. గూగుల్ మ్యాప్స్ ఫొటో వైరల్..!

Bengaluru Traffic : ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో రెండోదిగా బెంగళూరు ఐటీ నగరం పేరుపొందింది. ప్రతిరోజూ నగరంలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడానికి ముఖ్య కారణాలు ఇవే..

Google Maps Shows Walking ( Image Source : Google )

Bengaluru Traffic : బెంగళూరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్.. బయటకి వెళ్లిన వాళ్లు మళ్లీ ఎప్పుడు తిరిగి ఇంటికి చేరుకుంటారో చెప్పడం కష్టమే. అంతగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌ అవుతుంటుంది. అదే వర్షకాలం అయితే ట్రాఫిక్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. 2023లో ప్రపంచంలో అత్యంత దారుణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పది నగరాల్లో బెంగళూరు ఒకటిగా నిలిచింది.

అదే ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండవ నగరంగా ఐటీ నగరంగా పేరుపొందింది. వేగవంతమైన పట్టణీకరణ, పేలవమైన ప్రణాళిక, పరిమిత ప్రజా రవాణా ఎంపికలతో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజూ నగరంలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఐటీ సిటీలో పాయింట్ ’ఎ‘ నుంచి ‘బి’ వరకు డ్రైవ్ చేయడం కన్నా కొన్నిసార్లు నడవడం చాలా వేగంగా ఉంటుందని గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ధృవీకరించింది.

Read Also : Viral Video : కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటున్న ఓలా డెలివరీ ఏజెంట్.. వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్!

ట్విట్టర్ (X) యూజర్ ఆయుష్ సింగ్ గూగుల్ మ్యాప్స్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుంచి కేఆర్ పురం రైల్వే స్టేషన్‌కు వెళ్లడానికి పట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. అంటే.. కారులో డ్రైవింగ్ సమయం దాదాపు 6 కిలోమీటర్ల దూరం నడవడానికి పట్టే సమయాన్ని చూపుతుంది. ఫొటో ప్రకారం.. రెండు పాయింట్ల మధ్య డ్రైవింగ్ చేయడం ఒక వ్యక్తికి 44 నిమిషాలు పడుతుంది. అయితే, నడక 42 నిమిషాలకు కొంచెం వేగంగా చూపిస్తుంది. ఈ ఫొటోను షేర్ చేసిన సింగ్.. “ఇది బెంగళూరులో మాత్రమే జరుగుతుంది.” అంటూ పోస్టు పెట్టారు.

బెంగళూరు మాత్రమే కాదు.. మెట్రో నగరాలెన్నో :
ఈ పోస్టు వైరల్ కావడంతో 6 లక్షల 26వేల కన్నా ఎక్కువ వ్యూస్, 14వేల కన్నా ఎక్కువ లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది నెటిజన్లు బెంగళూరు ట్రాఫిక్‌తో అలసిపోయిందని కామెంట్ పెట్టగా.. మరికొందరు సింగ్ “బెంగళూరులో మాత్రమే ” అనే పదాన్ని వ్యతిరేకించారు. “ప్రపంచంలోని అనేక మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి” అని మరో యూజర్ కామెంట్ చేశాడు. “ముంబై, ఢిల్లీ కూడా ట్రాఫిక్ రద్దీతో అదే పరిస్థితి” ఉందని మరొకరు కామెంట్ చేశారు.

ట్రాఫిక్ రద్దీపై నెటిజన్ల రియాక్షన్ :
“మీకు సమయం చాలా ముఖ్యమైతే.. గరుడాచారపాల్య నుంచి కేఆర్ పురం 3వ మెట్రో స్టేషన్ అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తదుపరిసారి మీరు దీనిని ప్రయత్నించవచ్చు” అని మరో యూజర్ సూచించారు. బెంగళూరును “భారత్ ట్రాఫిక్ రాజధాని” అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. దానికి మరో యూజర్ స్పందిస్తూ.. నిందించడం ఆపండి.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఉపయోగించడం ప్రారంభించండి.. మిమ్మల్ని 13 నిమిషాల్లో అక్కడికి తీసుకెళ్లగలదని వ్యాఖ్యానించారు. “డ్రైవ్‌తో నడకను పోల్చినప్పుడు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కేవలం 13 నిమిషాలనే విషయాన్ని గమనించడం మర్చిపోయారు. ట్రాఫిక్‌కు సరైన పరిష్కారం పబ్లిక్ ట్రాన్‌ఫోర్ట్ అని మరిచిపోతున్నారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.

ట్రాఫిక్ విషయంలో చైనాను ఫాలో అవ్వండి :
ఇటీవలే బెంగళూరు ట్రాఫిక్‌పై ఓ వ్యాపారవేత్త సూచన చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. నివాసితులు రోజువారీ ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవటానికి చైనా నుంచి ఒక ఆలోచనను తీసుకోమని ఆయన సూచన.. బీజింగ్‌లో ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్న ప్రయాణికులు “రెస్క్యూ” కోసం ఎలా పిలుస్తారో వివరిస్తూ ట్విట్టర్ వేదికగా పరాస్ చోప్రా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. బీజింగ్‌లో ట్రాఫిక్ నుంచి మిమ్మల్ని రక్షించడానికి మీరు ఎవరికైనా 60 డాలర్లు చెల్లించవచ్చునని, అందుకు మిమ్మల్ని మోటర్‌బైక్‌పై ఎక్కించుకుంటారు. మరొకరు మీ కారును దాని గమ్యస్థానానికి తీసుకువెళతారని చెప్పుకొచ్చారు.

Read Also : Zomato Delivery Boy : ఉండేది ముంబై మురికివాడలో.. నెలకు అద్దె రూ. 500.. జొమాటో డెలివరీ బాయ్ రియల్ లైఫ్ స్టోరీ..!

ట్రెండింగ్ వార్తలు