లేటెస్ట్ ఆర్మ్స్.. హైటెక్నాలజీతో మిస్సైల్స్.. త్రివిధ దళాలను పట్టిష్టం చేస్తున్న భారత్!

మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.

India Defence Budget 2024

India Defence Budget 2024: ఒకేసారి యాభై మంది గన్ పట్టుకుని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో తెలుసా.? అచ్చం ఇండియన్ ఆర్మీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. పరేడ్, ప్రాక్టీస్‌లోనే కాదు.. అవసరమైనప్పుడు కదనరంగంలో కూడా ఇచ్చి పడేస్తోంది ఇండియన్ ఆర్మీ. శత్రవు ఎవడైనా.. శాంతి జపం, చర్చలు కొన్నాళ్లే. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే దేనికీ వెనకాడేది లేదని తేల్చి చెబుతోంది భారత్. మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.

గెలుపు నీ తలుపు తట్టాలంటే కష్టమే కాదు.. బలం, బలగం కూడా అవసరం. మారుతోన్న పరిస్థితులను బట్టి శత్రువుతో పోరాడే స్టామినా ఉండాలంటే పెట్టుబడి కూడా పెట్టాలి. అందుకే డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతోంది భారత్. పదేళ్లుగా రక్షణరంగానికి కేటాయిస్తోన్న బడ్జెట్ పెరిగిపోతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా డిఫెన్స్ సెక్టార్‌కు భారీగానే నిధులు అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6 లక్షల 21 వేల 940 కోట్లు కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. గత బడ్జెట్‌లో రూ.5 లక్షల 94 వేల కోట్లు ఇస్తే ఈ సారి ఆ వాటాని మరింత పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడిచ్చిన డిఫెన్స్ బడ్జెట్ 4.72 శాతం ఎక్కువ. ఈ ఏడాది మొత్తం బడ్జెట్‌లో డిఫెన్స్‌కే 12.90 శాతం నిధులు కేటాయించి.. రక్షణ రంగానికి తాము ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో తేల్చి చెప్పింది మోదీ సర్కార్.

త్రివిధ దళాలు పటిష్టం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని దేశీయంగా ఆయుధాలు, యుద్ధసామాగ్రిని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే నిధులు ప్రతీ ఏడాది పెంచుతూ వస్తోంది. బార్డర్‌ రోడ్ల డెవలప్‌మెంట్ కోసం కూడా కేంద్రం ప్రత్యేకంగా రూ.6 వేల 5వందల కోట్లు కేటాయించింది. ఇక తీరప్రాంతాల రక్షణకు రూ. 7వేల 6వందల కోట్లు ఇచ్చింది. DRDOకు ఇచ్చే నిధులను ఈ సారి రూ. 23 వేల 555 కోట్లకు పెంచింది కేంద్రం. పదేళ్లుగా త్రివిధ దళాల పటిష్టం కోసం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటోంది సెంట్రల్ గవర్నమెంట్.

ఆయుధ సమీకరణే లక్ష్యంగా..
అంతర్జాతీయంగా పరిస్థితులు మారుతున్నాయి. ఓ వైపు హమాస్, ఇజ్రాయెల్ వార్.. మరోవైపు రష్యా, యుక్రెయిన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్త పరిస్థితులతో భారత్ అలర్ట్ అయింది. ఇప్పటివరకు మనకు చైనా, పాక్‌తోనే గొడవ ఉంది. ఈ రెండు దేశాలే కాదు అనుకోకుండా ఇంకేదైనా కంట్రీతో శత్రుత్వం ఏర్పడవచ్చు. గొడవ ఏదైనా, సవాళ్లు ఏ రూపంలో వచ్చినా రేపటి కోసం సర్వం సిద్ధం చేసుకుంటోంది భారత్. ఆయుధ సమీకరణే లక్ష్యంగా.. మన రక్షణరంగం బలోపేతం చేస్తూ వస్తోంది. అన్నింటికీ ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి.. మనమూ సహకారం అందించే స్థాయికి మన డిఫెన్స్ సెక్టార్ ఎదుగుతోంది. ఒకప్పుడు భారత రక్షణరంగం కాస్త వీకే. అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్, మిస్సైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. డిఫెన్స్ ఫీల్డ్‌లో మనమేం తక్కువ కాదు. ఒక్కో అడుగు ముందుకేస్తూ.. రక్షణరంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రప్రభుత్వం. ఒక్కో వెపన్, మిస్సైల్‌తో మన అమ్ములపొదిలోకి తిరుగులేని ఆయుధ సంపత్తి చేరుతోంది.

శత్రువు ఏ రూపంలో వచ్చినా..
లేటెస్ట్ వెపన్స్, మిస్సైల్స్ మిగతా ఎక్విప్‌మెంట్స్ అయితే గతానికి ఇప్పటికి పోలిస్తే ఓ రేంజ్‌లో పెరిగాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌, నేవీని పటిష్టం చేసి.. శత్రువు ఏ రూపంలో వచ్చినా దాడికి ప్రతిదాడి చేసేలా రెడీ అయింది భారత్. శత్రువుల టార్గెట్‌గా డ్రోన్ విధ్వంసక ఎక్విప్‌మెంట్, అధునాతన ఆయుధాలు, క్షిపణుల వరకు ప్రతి ఆయుధం తయారుచేస్తోంది. మన సెల్ఫ్ మేడ్ తేజస్ యుద్ధవిమానాలు, ధనుష్‌ గన్‌ వ్యవస్థ, షారంగ్ గన్ సిస్టమ్‌ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. K9 వజ్రా యుద్ధ ట్యాంకు శత్రు బంకర్లను ముక్కలు ముక్కులుగా చేసి పడేస్తుంది. అధునాతన యుద్ధ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది భారత్. డ్రోన్లు, మిస్సైల్స్‌ను అమెరికా, చైనాతో పోటీపడి మరీ తయారు చేస్తోంది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్, షార్ట్ రేంజ్, బాలిస్టిక్ మిస్సైల్స్ విషయంలో దూకుడుగా ముందుకెళ్తుంది భారత్. మన కోసం ఆయుధాలు సమకూర్చుకోవడమే కాదు.. 85 దేశాలకు ఆర్మీ వెపన్స్ సప్లై చేస్తుంది ఇండియా.

Also Read : దేశంలో ఇంధన ధరలు తగ్గనున్నాయా.. కేంద్ర ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?

కార్గిల్ ఘటన నుంచి పాఠాలు
కార్గిల్ ఘటన నుంచి భారత్ చాలా నేర్చుకుంది. ప్రత్యేకంగా రక్షణ బడ్జెట్ పెంచుతూ వస్తున్నారు. 2000-2001లో డిఫెన్స్ బడ్జెట్ 58వేల కోట్లు ఉంటే..ఇప్పుడు 6 లక్షల కోట్లకు పైగాకు కేటాయింపులు జరిగాయి. దాంతో ప్రతీ ఏటా కొత్త ఆయుధాలు, ప్రయోగాలు చేస్తూ పటిష్టం అవుతూ వస్తోంది భారత్. గల్వాన్ లోయలో చైనా కవ్వింపులు, ఇటు కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో పాక్ కుట్రలకు తగ్గట్లుగా వెపన్స్, అడ్వాన్స్‌డ్ నిఘా సిస్టమ్, సైనిక శిక్షణ వంటి వాటిని బలోపేతం చేస్తూ వచ్చింది ఇండియా. అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది.

Also Read : ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు ఎంత.. కేంద్రం ఏమీ చెప్పిందంటే?

అడ్వాన్స్‌డ్ ఆయుధాలు
1999లో మన దగ్గరున్న ఆయుధాలకు.. ఇప్పుడున్న ఆయుధాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే అప్పటి ఆయుధాల స్థానంలో మొత్తం లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ వచ్చేసింది. మిస్సైల్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లు అన్నింట్లో అడ్వాన్స్‌డ్ ఆయుధాలు వచ్చేశాయి. రష్యా, ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు కొనడంతో పాటు సెల్ఫ్ మేడ్ మిస్సైల్ సిస్టమ్ కూడా అప్‌గ్రేడ్ అయింది. అలా ఒకే ఒక ఒక్క యుద్ధం మన డిఫెన్స్ సెక్టార్‌ దిశనే మార్చేసింది. ఇప్పుడు రక్షణరంగంలో అంతో ఎంతో పటిష్టంగా ఉన్నామంటే కార్గిల్ యుద్ధం నేర్పించినా పాఠాలే.. అప్పటి నుంచి ఇప్పటివరకు పాలకుల చూపించిన ముందు చూపే అని చెప్పొచ్చు.

ట్రెండింగ్ వార్తలు