International Mothers Day : మదర్స్ డే సెలబ్రేట్ చేయాలనే ఆలోచన అసలు ఎవరిది?

అమ్మ కోసం ఒకరోజు. ఈ రోజుకి ఒక చరిత్ర ఉంది. ప్రాముఖ్యత ఉంది. విదేశాలకే పరిమితమైన ఈ సెలబ్రేషన్ భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా సంప్రదాయంగా మారింది. ఈరోజు తల్లికి శుభాకాంక్షలు చెప్పడం .. బహుమతులు ఇవ్వడం ద్వారా ప్రేమను చాటుతారు. నిజానికి అమ్మకు ఏమిచ్చినా రుణం తీరదు.

Significance of Mother’s Day :  ప్రతిరోజు ఏదో ఒక పేరుతో ప్రత్యేక దినోత్సవాలు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ అమ్మ కోసం ఒకరోజు అనేది అందరికీ ప్రత్యేకం. అమ్మ లేని మనుగడ లేదు. ఏటా మే నెల రెండవ ఆదివారం “అంతర్జాతీయ మాతృ దినోత్సవం” జరుపుకుంటాం. ఈ సంవత్సరం మే 14వ తేదీన ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.

Temple to Mother : రూ.10 కోట్ల ఖర్చుతో..పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్న కొడుకు

“మదర్స్ డే” 20వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభమైంది. అన్నాజార్విస్ అనే మహిళ తన తల్లి “ఆన్ రీవ్స్ జార్విస్” తో పాటు తల్లులను అందరూ గౌరవించాలని కోరుకుందట. 1905లో మరణించిన తన తల్లి జ్ఞాపకార్థం జాతీయ సెలవుదినాన్ని ఏర్పాటు చేయాలనే ప్రచారాన్ని ప్రారంభించిందట.

 

1914లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 28వ ప్రెసిడెంట్ గా ఉన్న వుడ్రో విల్సన్ మే నెల రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రకటిస్తూ సంతకం చేశారట. అప్పటి నుంచి అక్కడ అధికారిక సెలవు దినంగా మారింది. ఆ తరువాత నుంచి ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సింగపూర్‌లలో ఈ దినోత్సవం నిర్వహించుకోవడం సంప్రదాయంగా మారింది.

precious gift for mom : అమ్మకి ఏమి బహుమతి ఇవ్వాలి…

అసలు ఈ దినోత్సవం జరుపుకోవడం వెనుక పురాతన చరిత్ర ఉందని చెబుతారు. గ్రీకులు, రోమన్లు వారి మాతృ దేవతలైన రియా మరియు సైబెలేలని గౌరవిస్తూ పండుగలు నిర్వహించేవారట. అలా ఈ దినోత్సవం ప్రచారంలోకి వచ్చిందని చెబుతారు.

 

ఈ సంవత్సరం మదర్స్ డే మే నెల రెండవ ఆదివారం అంటే మే 14 న నిర్వహిస్తున్నారు. తల్లికి శుభాకాంక్షలు చెప్పడం.. ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడం, వారు కుటుంబం కోసం పడుతున్న కష్టం, త్యాగాన్ని గుర్తించి వారిని గౌరవించడం ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. తల్లికి ఏమిచ్చినా రుణం తీరదు. ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకోవడమే బిడ్డలు తల్లికి ఇచ్చే విలువైన కానుక. అమ్మలందరికీ ” అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు”.

ట్రెండింగ్ వార్తలు