India-China Border Clash At LAC : చైనా-భార‌త సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ .. అరుణాచ‌ల్ వ‌ద్ద ఫైట‌ర్ జెట్స్ పెట్రోలింగ్‌

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది.

India-China Border Clash At LAC : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబ‌ర్ 9 (2022)జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా-భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నిఘా ముమ్మరం చేసింది. డ్రాగన్ ఉల్లంఘ‌న‌ల‌ను అడ్డుకునేందుకు గ‌త కొన్ని రోజుల నుంచి భార‌త వైమానిక ద‌ళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అరుణాచ‌ల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వ‌ద్ద జోరుగా పెట్రోలింగ్ జ‌రుగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

India-China face off: చైనా సైనికులు మన భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు: లోక్‌సభలో రాజ్‌నాథ్ ప్రకటన

డిసెంబ‌ర్ 9వ తేదీన త‌వాంగ్ సెక్టార్ వ‌ద్ద చైనా బ‌ల‌గాలు ఎల్ఏసీ దాటి భార‌త భూభాగంలోకి వ‌చ్చినందని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. చైనా సైనికులను భారత్ సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారని వెల్లడించారు. ఘ‌ర్ష‌ణ రోజున ఇరు వ‌ర్గాల ద‌ళాల‌కు స్వ‌ల్ప స్థాయిలో గాయాలైన‌ట్లు తెలుస్తోంది. కానీ మంత్రి మాత్రం భారత సైనికులకు ఎటువంటి గాయాలు అవ్వలేదని తెలిపారు.

కాగా..అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నారు. ఆర్మీతో పాటు పలువురు అధికారులు ఇందులో పాల్గొననున్నారు. అనంతరం ఆయన ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రకటించారు.

India-China face off: రాజ్‌నాథ్ ప్రకటన తర్వాత లోక్‌సభలో గందరగోళం.. విపక్షాల వాకౌట్

 

 

 

ట్రెండింగ్ వార్తలు