Horror మూవీలను భయపడకుండా చూస్తే.. ఈ కంపెనీ రూ. 95,500 చెల్లిస్తానంటోంది!

హర్రర్ మూవీలు ఇష్టామా? హంటెడ్ సినిమాలు చూస్తారా? హర్రర్ మూవీలు చూస్తున్నప్పుడు భయపడకుండా ఉండేవాళ్లకు అమెరికా కంపెనీ రూ.95,500 చెల్లించాస్తామంటోంది.

Love horror films : హర్రర్ మూవీలు ఇష్టామా? హంటెడ్ సినిమాలు చూస్తారా? సాధారణంగా చాలామందికి హర్రర్, హంటెడ్ మూవీలు చూస్తున్నప్పుడు భయపడిపోతుంటారు. ఏదైనా హర్రర్ సీన్ వస్తున్నప్పుడు వారి హార్ట్ బీట్ ఒక్కసారిగా వేగంగా పెరిగిపోతుంది. హర్రర్ మూవీలు తీసే దర్శకులు కూడా భయానక సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అమెరికాకు చెందిన FinanceBuzz అనే సంస్థ కొత్త కాన్సెప్ట్ జాబ్ ఆఫర్ ఇచ్చింది. చేయాల్సిందిల్లా హర్రర్ మూవీలు చూడటమే… మూవీ చూసి ఎంత భయాన్ని కలిగించిందో విశ్లేషించడమే వీరి పని.
Income Tax : సోనూ ఇంటికి మరోసారి ఐటీ అధికారులు

అందుకు వీరికి ఈ కంపెనీ ఎంత చెల్లిస్తుందో తెలుసా? అక్షరాలా 1,300 అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో రూ.95,500)గా నిర్ణయించింది. అయితే ఈ జాబ్ కు ఎంపికైన 13 వరకు హర్రర్ మూవీలు చూడాల్సి ఉంటుంది. అప్పుడు వారి చేతికి Fitbit కూడా ధరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారి హార్ట్ బీట్ ఎంత ఉందో మానిటర్ చేస్తుంటారు. అంతేకాదు.. మూవీ చూసిన వ్యక్తి ర్యాంకు, రేటింగ్ కూడా ఇవ్వొచ్చు అంటోంది. హర్రర్ సీన్లు వచ్చేటప్పుడు సౌండ్ కూడా బాగా వినిపించేలా వారికి హెడ్ సెట్ కూడా పెడతారు.

మీరు చూసే హర్రర్ మూవీల్లో Amityville horror నుంచి Annabelle వంటివి కూడా ఉన్నాయి. ఈ మూవీల్లో మెడ వెనక్కి తిరగడం వంటి అనేక హర్రర్ సీన్లు చూస్తే గుండె జారిపోయినంతగా అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటో కంపెనీ రివీల్ చేసింది. సాధారణంగా ఏదైనా హర్రర్ మూవీ తీస్తే.. హైబడ్జెట్ పెట్టి తీస్తుంటారు. అలాగే లో బడ్జెట్ మూవీలను కూడా తీస్తారు. అయితే ఇందులో ఏ బడ్జెట్ హర్రర్ మూవీ.. సీట్లో కూర్చొని చూస్తున్న ప్రేక్షకుడిని మరింత భయపెడుతుందో తెలుసుకోనేందుకు ఈ తరహా ఆఫర్ ఇచ్చినట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది.
Maggi Milkshake: ‘మ్యాగీ మిల్క్‌షేక్’ వింత వంటకంపై..నెట్టింట్లో తిట్ల దండకం

ట్రెండింగ్ వార్తలు