Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా" ఇటీవల ప్రకటించింది.

Alien Planets: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5,000 గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” ఇటీవల ప్రకటించింది. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరిక్షించిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాల అన్వేషణ, వాటిపై గ్రహాంతర వాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018లో నాసా ఈ TESS శాటిలైట్ ను ప్రయోగించింది. ఆనాటి నుంచి 5,000 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం.. వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే.. 2400 గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ TESS గుర్తించిందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)కి చెందిన పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు.

Also read: India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్

ఇక TESS గుర్తించిన 5,000 బాహ్యగ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు, వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. TESS ఉపగ్రహం.. ఖగోళ వస్తువును కనిపెట్టి.. దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండడంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యం అవుతుంది. ఇక TESS కంటే ముందు బాహ్యగ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్లెర్ టెలిస్కోప్.. 2000 ఖగోళ వస్తువులను కనుగొన్నా.. అవేవి.. గ్రహాలుగా నిర్ధారింపబడలేదు. TESS కనిపెట్టిన ఒక గ్రహంపై ఏడాది కాలం.. భూమిపై 16 గంటలకే ముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిచెల్ కునిమోటో తెలిపారు.

Also read: TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన డీహెచ్

దీంతో TESS పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదిరింది. అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన TESS శాటిలైట్ సేవలను మరో మూడేళ్ళ పాటు(2025 వరకు) వినియోయోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశాం ఉందని మాత్రమే అంచనా వేశామని.. కానీ నిర్ధారణ చేయలేదని మిచెల్ కునిమోటో తెలిపారు.

Also read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత?

ట్రెండింగ్ వార్తలు