Olena Zelenska: అత్యాచారాలు చేయమని భర్తలను ప్రోత్సహిస్తున్నారు.. రష్యన్ మహిళలపై జెలెన్‭స్కా సంచలన ఆరోపణ

యుద్ధమే భయంకరమైంది. అలాంటి ఈ యుద్ధంలో ఎదుటి వారిపై ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం లైంగిక హింసలకు పాల్పడటం మరింత క్రూరమైంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ వస్తున్నాయి. అయితే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ దారుణ పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం

Olena Zelenska: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రష్యా తమ దేశంపై అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రష్యా సైనికులు అత్యాచారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణల్లో కొత్త కోణాన్ని బయట పెట్టారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‭స్కీ సతీమణి ఒలెనా జెలెన్‭స్కీ. తమ దేశ మహిళలపై అత్యాచారాలు చేయమంటూ రష్యా సైనికులను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘యుద్ధాలు, అల్లర్ల సమయంలో జరిగే లైంగిక హింసను అరికట్టాలి’ అనే అంశంపై బ్రిటన్ రాజధాని లండన్ వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఒలెనా జెలెన్‭స్కా పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు.

Nirmala Sitharaman: సాంకేతికత ఉపయోగించి రూ.2,00,000 కోట్లు ఆదా చేశాం.. కేంద్ర ఆర్థిక మంత్రి

‘‘యుద్ధమే భయంకరమైంది. అలాంటి ఈ యుద్ధంలో ఎదుటి వారిపై ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం లైంగిక హింసలకు పాల్పడటం మరింత క్రూరమైంది. చాలా సందర్భాల్లో ఇలా జరుగుతూ వస్తున్నాయి. అయితే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ దారుణ పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. రష్యన్ బలగాలు ఇప్పటికే మా దేశంపై అనేక మారణాయుధాలు ప్రయోగిస్తున్నారు. ఇవి సరిపోనట్లు లైంగిక అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారు. మరో దారుణ విషయం ఎంటంటే, ఇలా చేయమని వారి భార్యలే వారిని పోత్సహిస్తున్నారు. కుటుంబ సభ్యులు, భార్యలు వారికి ఫోన్ ద్వారా ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు’’ అని ఒలెనా జెలెన్‭స్కా అన్నారు.

Gujarat Polls: ఆప్‭కు అంత సీన్ లేదు.. ఒక్క సీటు కూడా గెలవదంటూ అమిత్ షా ఎద్దేవా

ట్రెండింగ్ వార్తలు