Pfizer : నకిలీ ఫైబర్ టీకాల జప్తు…80 మందికి బోగస్ టీకాలు

మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.

COVID-19 Vaccine Doses : కరోనా వైరస్ జనాలను చంపేస్తుంటే..ఇదే అదనుగా..కొంతమంది నకిలీ టీకాలను పంపిణీ చేస్తూ..సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా నిల్వ చేయడం, బోగస్ టీకాలను జనాలకు వేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫైబర్ కంపెనీకి చెందిన నకిలీ టీకాలను మెక్సికో, పొలాండ్ దేశాల్లో గుర్తించారు. వీటిని అధికారులు సీజ్ చేశారు. ఒక్కో డోసును వెయ్యి డాలర్లకు ఇస్తున్నట్లు అమెరికా మీడియా ఓ కథనం ప్రచురించడం కలకలం సృష్టిస్తోంది.

మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. పొలండ్ లో కూడా నకిలీ టీకాలు పంపిణీ జోరుగా కొనసాగుతోందని, ఫైబర్ టీకాలు లభ్యమైనట్లు మార్చి నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ టీకాలను పరీక్షించిన ఫైబర్…వాటిలో బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ మందు లేనట్లు గుర్తించింది. హోండరస్ కు వెళుతున్న ఓ విమానం నుంచి సుమారు 6 వేల డోసులు స్పుత్నిక్ టీకాలను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ టీకాలు నిజమా ? కావా ? అనే అనే కోణంలో మెక్సికో అధికారులు విచారణ చేపడుతున్నారు.

Read More : Visakha Oxygen Plant : ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్.. అందరి దృష్టంతా విశాఖ ఆక్సిజన్ ప్లాంట్ పైనే

ట్రెండింగ్ వార్తలు