Rishabh Pant Sixes : క్రికెట్ గాడ్ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతిపిన్న వయస్కుడైన ఇండియన్ క్రికెటర్ గా పంత్ నిలిచాడు.(Rishabh Pant Sixes)

Rishabh Pant Sixes : ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ మరో రికార్డు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సిక్సులు కొట్టిన అతిపిన్న వయస్కుడైన ఇండియన్ క్రికెటర్ గా పంత్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 25ఏళ్ల వయసులో సచిన్ వంద సిక్స్ ల మైలురాయిని చేరుకున్నాడు. పంత్ 24ఏళ్ల 271 రోజుల్లోనే 100 సిక్సర్లు కొట్టి రికార్డు నెలకొల్పాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పంత్ చెలరేగి ఆడాడు. సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో పంత్ 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 19 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మొత్తంగా టెస్టుల్లో 48 సిక్సులు, వన్డేల్లో 24 సిక్సులు, టీ20లలో 31 సిక్సులు బాదాడు పంత్.

Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్

ఈ టెస్ట్ మ్యాచ్ కి ముందు పంత్ అంతర్జాతీయ క్రికెట్ లో 99 సిక్సులు బాదాడు. ఇంగ్లండ్ బౌలర్లపై పంత్ ఎదురుదాడికి దిగాడు. పరుగుల వరద పారించాడు. అంతేకాదు 89 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ వికెట్ కీపర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. టెస్ట్ కెరీర్ లో పంత్ కు ఇది 5వ టెస్ట్ సెంచరీ. ఇంగ్లండ్ జట్టుపై 3వది.(Rishabh Pant Sixes)

Jasprit Bumrah: సార‌థిగా కంటే బౌల‌ర్‌గానే జ‌ట్టుకు బాగా అవ‌స‌రం: ద్ర‌విడ్‌

ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లో టాప్‌ ఆర్డర్‌ విఫలమైన వేళ రిషబ్ పంత్ ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కాడు. రవీంద్ర జడేజా (83*)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగులను జోడించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 338/7 స్కోరు సాధించింది. అద్భుత శతకం బాదిన పంత్ పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్‌ గంగూలీ, ఇయాన్ బిషప్, జై షా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆనంద్‌ మహింద్రా, వసీమ్‌ జాఫర్, ఇషా గుప్తా, రషీద్‌ ఖాన్‌ తదితరులు పంత్ ను అభినందించారు. ప్రశంసలతో ముంచెత్తారు.

ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశావు. ఇదొక స్పెషల్‌ ఇన్నింగ్స్‌ అని సౌరభ్ గంగూలీ కితాబివ్వగా.. ప్రపంచంలోనే అత్యంత ఎంటర్‌టైన్‌మెంట్ క్రికెటర్‌ రిషబ్ పంత్‌ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కీర్తించాడు. అత్యద్భుతం. వెల్‌డన్‌ రిషబ్ పంత్. జడేజా కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ ఇద్దరూ మంచి షాట్లు ఆడారు అని క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసించాడు. టెస్ట్ క్రికెట్‌లో తాండవం చేశాడు. రిషబ్ పంత్‌ స్పోర్ట్స్‌ ఆర్టిస్ట్‌. అతడిని చూసి ఆశ్చర్యపోకుండా ఉండటం అసాధ్యం అని ఆనంద్ మహింద్రా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు