Afghan Crisis : వాలీబాల్ క్రీడాకారిణి తల నరికేసిన తాలిబన్లు

అఫ్ఘానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు దురాగతాలకు అంతులేకుండాపోతోంది. వారి కిరాతకాల్లో భాగంగా వాలీబాల్ క్రీడాకారిణి తల నరికిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Taliban beheaded a volleyball player : అఫ్ఘానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నారు. వారి దురాగతాలకు అంతులేకుండాపోతోంది. ముఖ్యంగా మహిళల పట్ల వారి అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. మహిళా క్రీడాకారిణుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతోమంది దేశం వదిలిపారిపోయారు. వెళ్లటానికి వీలుకానివారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈక్రమంలో పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.

వారి అకృత్యాల్లో భాగంగా మహబజిన్ హకీమి అనే అఫ్ఘాన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. ఆమెను హత్య చేసినట్లుగా బయటకు తెలిస్తే మిమ్మల్ని కూడా చంపేస్తామని తాలిబన్లు క్రీడాకారిణి కుటుంబాన్ని బెదిరించారని తెలిపారు. ఆ ఇంటర్యూలో.. కోచ్ పలు విషయాలు వెల్లడించారు. అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపారు. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను కూడా ఇప్పటి వరకు ఈ దారుణ హత్య గురించి చెప్పలేకపోయానని తెలిపారు.

Read more : Afghanistan : మరో దారుణం.. జానపద గాయకుడిని హత్యచేసిన తాలిబన్లు

అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు మహబజిన్ హకీమి కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె కూడా ఒకరని తెలిపారు. ఆగష్టులో తాలిబన్లు కాబూల్ ను హస్తగతం చేసుకోవటానికి ముందు వాలిబాట్ జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ తెలిపారు.ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని..చాలామంది క్రీడాకారిణిలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి జీవిస్తున్నారని..తాలిబన్ల వల్ల ఏ క్షణాన ఏం జరుగుతోందో..ఏ క్షణంలో తమ ప్రాణాలు తీసేస్తారనే అనే భయంతో బతుకుతున్నారని కోచ్ వెల్లడించారు.

Read more : Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

గత వారం..ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు. మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల స్వాధీనం చేసుకున్నప్పటినుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల ప్రమేయాన్ని ఏమాత్రం సహించటంలేదు. బాలికల్ని స్కూళ్లకు కూడా వెళ్లనివ్వటంలేదు. ఇంటికే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు.

Read more : Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి

ఇటువంటి దుర్మార్గపు పరిస్థితుల మధ్య అఫ్గానిస్థాన్ లో మహిళలపై జరుగుతున్న హింస తలచుకుంటునే గుండెలు అవిసిపోతున్నాయి. ఇక అక్కడ జీవిస్తున్నవారి పరిస్థితి ఇంకెంత భయానకంగా ఉంటుందో అని ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఇక భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్‌ ప్రజలు..ముఖ్యంగా మహిళలు అనుక్షణం ఛస్తూ బతుకుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు