జూన్ 21 ‘‘సెవెన్ స్పెషల్ డేస్’’…అవేంటంటే..

  • Publish Date - June 20, 2020 / 05:38 AM IST

రేపు ఆదివారం.జూన్ 21తేదీ కూడా. దీనికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. రేపు అంటే జూన్ 21 ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదికకానుంది. ఏడు ‘డే’లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న ‘‘డూమ్స్ డే’’ కూడా ఉండంతో మరో విశేషం. (జూన్21,2020న ప్రపంచం అంతం అయిపోతుందని కొంతమంది వాదన) దీని గురించి పక్కన బెట్టితే..మిగతా ఏ దినోత్సవాలు జరుగుతాయో..ఎందుకు జరుగుతాయో..ఆరోజు ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాం..ముుందుగా ప్రపంచ యోగా దినోత్సవం గురించి తెలుసుకుందాం..

ప్రపంచ యోగా దినోత్సవం :2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తరువాత ప్రతి సంవత్సరం జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఈరోజే ఎందుకు అంటూ..ఏడాదిలో జూన్ 21 తేదీ పగటి సమయం అత్యధికంగా ఉంటుంది. అది ఈరోజు అంటూ జూన్ 20,21,22 తేదీల్లో మాత్రమే. ఆపై పగటి సమయం తగ్గుదల ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజుల మధ్య రోజును యోగా దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ నిర్ణయించారు.అదన్నమాట అసలు సంగతి. 

ఫాదర్స్ డే: నాన్నల దినోత్సవం. వాస్తవానికి ఫాదర్స్ డే ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం నాన్నల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మూడో ఆదివారం జూన్ 21న వచ్చింది. నాన్నకు ఓ ప్రత్యేక రోజు అనేది ఉండాలని కాదు. కానీ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన సుఖాన్ని కూడా పక్కన పెట్టి కుటుంబం శ్రేయస్సు కోసం పాటుపడే తండ్రిని గౌరవించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి అమ్మల దినోత్సం కూడా ఉందనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మదర్స్ డే మే నెలలో రెండో ఆదివారం వస్తుందన్న సంగతి తెలిసిందే.

షేక్ హ్యాండ్ డే: జూన్ 21 ఆదివారం నాడు షేక్ హ్యాండ్ డే అంటే కరచాలన దినోత్సవం. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని ఈ ఏడాది కరచాలన దినోత్సవం జరిగేలా లేదు. అందుకని ఈ రోజుచేసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ ఆరోగ్యం ముఖ్యం కదా. 

సంగీత దినోత్సవం: వరల్డ్ మ్యూజిక్ డేను కూడా రేపు జరుపుకోనున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్ మ్యూజిక్ డేను ప్రారంభించారు. ఈరోజున బహిరంగ ప్రదేశాల్లో తమ తమ వాయిద్య పరికరాలతో సంగీతాన్ని వినిపిస్తుంటారు సంగీత కళాకారులు. అది విన్నవారికి చక్కటి ప్రశాంతత లభిస్తుంది. కానీ కరోనా పుణ్యమాని ఈ ఏడాది మ్యూజిక్ డేలను ఇంటికే పరిమితం కావటం మంచిది.

ప్రపంచ మానవత్వ దినోత్సవం: జూన్ 21 వరల్డ్ హ్యూమనిస్ట్ డే కూడా. ప్రజల్లో మానవత్వాలను పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవత్వం పెంపొందించటానికి కృషి చేసేందుకు స్ఫూర్తినిచ్చే రోజు.

జల దినోత్సవం: వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా రేపు జరుగనుంది. జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడివుండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డే, 2005 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది.సమస్త ప్రాణికోటికి జీవాధానం నీరు. ప్రస్తుతం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. నీటి సమస్య. నీరు ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము. నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటితోనె జరిగింది. 

టీ షర్ట్ డే: వీటన్నింటితో పాటు టీ షర్ట్ దినోత్సవం కూడా రేపే.టీ షర్ట్ డే వల్ల సమాజానికి ఎటువంటి శ్రేయస్సు లేకపోయినా..2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని దేశాల్లో టీ షర్ట్ డే ఓ ఉత్సవంలా కూడా జరుగుతుంది.

బాగున్నాయి కదూ..జూన్ 21 తేదీ ప్రత్యేకతలు. ఇలా ప్రత్యేక రోజు అనేది ఎందుకు? అని చాలామంది అనుకుంటారు. కానీ..ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రత్యేక రోజుల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ రాబోయే తరాలకు వాటిని అందిస్తుంటారు. ఉదాహరణకు జల దినోత్సవం..నీటి కొరత రాకుండా..ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే అంశంపై చర్చలు జరుగుతాయి. వాటిని తీర్మానాలుగా చేసిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచిస్తుంది. అలా యోగాడే. అలాగే క్యాన్సర్ డే..క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుంటా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానికి ఆరోగ్యశాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చలు..సూచనలు జరుగుతాయి.ఇలా ప్రతీ ప్రత్యేక రోజులకు సంబంధించి చర్చలు..నిర్ణయాలు..సూచనలు ఉంటాయి.అందుకే ఆయా ప్రత్యేక రోజులు జరుపుకోవాల్సిన అవరసం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

Read: భారత సరిహద్దులో ఫొటోలు తీస్తున్న పాక్ spy డ్రోన్.. కూల్చేసిన BSF

ట్రెండింగ్ వార్తలు