North Korea : కిమ్‌‌ను తిడుతూ రాతలు..చేతిరాత నమూనాల పరిశీలన

బయట తిరగడం, పండుగ చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆదేశాలు బేఖాతరు చేసిన వారిని జైలుకు పంపారు. నియంతలా వ్యవహరిస్తున్న కిమ్‌ను తిడుతూ గోడపై రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.

Wall Writing Against Kim : ఉత్తర కొరియా ప్రస్తుతం తీవ్రమైన ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రజలంతా తక్కువ తినాలంటూ దేశాధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గతంలో ఆదేశాలూ జారీ చేశాడు. అయితే… నీవల్లే జనాలు ఆకలితో మరణిస్తున్నారంటూ కిమ్‌ను తిడుతూ.. ఇటీవల ప్యోంగ్‌చాన్‌ డిస్టిక్‌లోని ఓ అపార్ట్‌మెంట్ గోడపై ప్రత్యక్షమైన రాతలు కలకలం రేపాయి. దీనిపై కిమ్‌ సీరియస్ అవడంతో… దాన్ని రాసిన వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ రాతలను వెంటనే తుడిచేసి… స్థానికులను ఆరా తీస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వేలాది మంది నివాసితుల చేతిరాత నమూనాలను పరిశీలిస్తున్నారు.

Read More : Deepthi Sunaina : నేను ఒంటరి కాదు.. తండ్రితో ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన దీప్తి సునైనా

పోలీసులు సైతం నిందితుడి ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉత్తర కొరియాలో ఇటువంటి రాతలు కనిపించడం అధికారులకు, సాధారణ ప్రజలకూ షాకింగ్‌గా ఉందంటున్నారు స్థానికులు. అయితే ఈ విషయాన్ని చాలామంది అంగీకరిస్తారని.. కానీ, బయట చెప్పుకోలేరన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బరువు తగ్గినట్లు కనిపిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా తన తండ్రి వర్ధంతి రోజుల్లో ఏడవడం, బయట తిరగడం, పండుగ చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆదేశాలు బేఖాతరు చేసిన వారిని జైలుకు పంపారు. నియంతలా వ్యవహరిస్తున్న కిమ్‌ను తిడుతూ గోడపై రాసిన రాతలు కలకలం సృష్టిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు