Volcano Erupts: జపాన్‪‌లో బద్ధలైన అగ్నిపర్వతం.. హై అలర్ట్ జారీ

జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. సకురజిమ అనే పర్వతం ఆదివారం సాయంత్రం బద్ధలవడంతో ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకు లావా శిలలు ఎగసిపడుతున్నాయి.

Volcano Erupts: జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. జపాన్ ఉత్తర భాగంలో ఉన్న క్యుషు (సకురజిమా) అనే పర్వత పరిధిలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్ధలైంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం పర్వతం బద్ధలై, లావా ఉప్పొంగుతున్నట్లు జపాన్ వాతావరణ శాఖ (జేఎమ్ఏ) వెల్లడించింది.

Son Murdered By Father: కొడుకును చంపి ముక్కలుగా నరికిన తండ్రి.. తప్పించుకునేందుకు ఏం చేశాడంటే

దీని ప్రభావం తీవ్రంగా ఉండటతో ఐదో నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు. దీన్ని హై అలర్ట్ కింద పరిగణిస్తారు. ప్రస్తుతం దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లావాకు చెందిన శిలలు ఎగిసిపడుతున్నాయి. మండుతున్న శిలలు ఎగిరిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రస్తుతం బద్ధలైన అగ్నిపర్వతానికి సమీపంలో కగోషిమా అనే పట్టణం ఉంది. ఇక్కడ దాదాపు ఆరు లక్షల మంది నివసిస్తున్నారు. సకురజిమ జపాన్‌లో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతం. ఇక్కడ తరచూ లావా బద్ధలవుతుంటుంది. 2019లో 5.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది.

Bill Gates: మంకీపాక్స్ కూడా బిల్‌గేట్స్ కుట్రే.. నిజం ఏంటి?

జపాన్ భూభాగం ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్స్ పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు రావడంతోపాటు, అగ్నిపర్వతాలు, సునామీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే భూకంపాల్లో 20 శాతం జపాన్‌లోనే నమోదవుతుండటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు