Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్‌లో గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నారా?

 బెర్ముడా ట్రయాంగిల్ వ‌ద్ద చోటు చేసుకున్న అనుమానాస్ప‌ద ఘ‌ట‌న‌ల గురించి ఎన్నో ఊహాజ‌నిత‌ క‌థ‌లు, సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.

Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ వ‌ద్ద చోటు చేసుకున్న అనుమానాస్ప‌ద ఘ‌ట‌న‌ల గురించి ఎన్నో ఊహాజ‌నిత‌ క‌థ‌లు, సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్తున్న విమానాలు, నౌక‌లు ఎందుకు అదృశ్య‌మ‌వుతున్నాయి? ఆ ప్రాంతం ఎందుకింత అంతుచిక్క‌ని ర‌హ‌స్యంగా మారింద‌న్న అంశాల‌ను ఛేదించ‌డానికి ఇప్ప‌టికీ ప‌లువురు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ గ్ర‌హాంతర‌ వాసులు ఉన్నార‌ని, అంతేగాక‌, అతీంద్రియ శ‌క్తులూ ఉన్నాయ‌న్న సిద్ధాంతాల‌నూ కొంద‌రు ప్ర‌తిపాదించారు.

Bermuda Triangle: విచిత్ర ఆఫ‌ర్.. నౌక అదృశ్య‌మైతే అందులోని ప్ర‌యాణికుల‌కు 100 శాతం రిఫండ్

అయితే, విమానాలు, నౌక‌లు ఎందుకు అదృశ్య‌మ‌వుతున్నాయ‌న్న విష‌యాన్ని నిర్ధారించేందుకు ఏ ఆధారాల‌నూ ప‌రిశోధ‌కులు ఇప్ప‌టివ‌ర‌కు చూప‌లేదు. ఈ నేపథ్యంలోనే, గ్రహాంతర వాసులే ఈ పనులన్నీ చేస్తున్నారని ఊహాగానాలు చాలా కాలంగా వస్తున్నాయి. మ‌రోవైపు, అక్క‌డ‌కు వెళ్లే నౌక‌లు మాన‌వ త‌ప్పిదాలు, ప్ర‌కృతి బీభ‌త్సం, అసాధార‌ణ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్లే త‌ప్పిపోతున్నార‌ని, అంతేగానీ, దీనికి ఏ ఇత‌ర అంశ‌మూ కార‌ణం కాద‌ని కూడా కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్ర‌జ‌ల్లో అపోహ‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

pani puri: పానీ పూరీ తిని 97 మంది పిల్ల‌ల‌కు అస్వస్థత

అయిన‌ప్ప‌టికీ ఇక్కడ జ‌రుగుతోన్న ప్ర‌మాదాల‌ను ఇత‌ర ఇటువంటి ప్రాంతాల్లో జ‌రిగే ప్ర‌మాదాల‌తో పోల్చి చూస్తూ చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌న్న విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లూ స‌రైన వివ‌ర‌ణ‌లు ఇవ్వ‌లేక‌పోతున్నారు. ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న తొలి అనుమానాస్ప‌ద ఘ‌ట‌న‌ను 1950, సెప్టెంబ‌రు 17న ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఎడ్వ‌ర్డ్ వాన్ వింకుల్ జోన్స్ అనే ప‌రిశోధ‌కులు అప్ప‌ట్లో దీనిపై ఓ ఆర్టిక‌ల్ రాశారు. రెండేళ్ల త‌ర్వాత జార్డ్ శాండ్ అనే వ్య‌క్తి బెర్ముడా ట్రయాంగిల్ గురించి మ‌రో ఆర్టిక‌ల్ రాశారు.

Nepal plane: నేపాల్‌లో విమానం అదృశ్యం.. ప్రయాణికుల్లో భారతీయులు

ఆ ప్రాంతంలో కొన్ని విమానాలు, నౌక‌లు అదృశ్య‌మ‌య్యాయ‌ని ఎడ్వ‌ర్డ్ వాన్, జార్డ్ శాండ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు బెర్ముడా ట్రయాంగిల్ గురించి గురించి ఎన్నో వార్త‌లు, ఊహాగానాలు వ‌స్తూనే ఉన్నాయి. అక్క‌డ జ‌రుగుతోన్న అనుమానాస్పద‌న ఘ‌ట‌న‌లు అంతుచిక్క‌క‌పోవ‌డంతోనే అక్క‌డ గ్ర‌హాంత‌ర వాసులు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు