Realme Buds Wireless 3 Neo : రియల్‌మి GT 6టీతో బడ్స్ వైర్‌లెస్ 3 నియో వస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Realme Buds Wireless 3 Neo : రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ఈ నెల 22న భారత మార్కెట్లో ధర రూ. 1,299కు లాంచ్ కానుంది.

Realme Buds Wireless 3 Neo GT 6T ( Image Credit : Google )

Realme Buds Wireless 3 Neo : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియోను మే 22న రూ. 1,299కి లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ ఫస్ట్ సేల్ మధ్యాహ్నం 2:30 గంటలకు realme.com, Amazon.in, Flipkartలో అందుబాటులో ఉండనుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ అనే 3 కలర్ ఆప్షన్లలో ఈ డివైజ్‌లను రిలీజ్ చేయనున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సరికొత్త నెక్‌బ్యాండ్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : iPhone 17 Series : స్లిమ్ రిఫ్రెష్డ్ డిజైన్‌తో అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 సిరీస్ మోడల్‌ వస్తోంది..!

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ఫీచర్లు (అంచనా) :
రియల్‌మి యువతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ను రూపొందించింది. నివేదికల ప్రకారం.. ఈ డివైజ్ సొగసైన డిజైన్, అసాధారణమైన ఫీచర్‌లతో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ బడ్స్ యూజర్లకు మునుపెన్నడూ లేని విధంగా నిరంతర ఆడియోను అందిస్తాయని పేర్కొంది. రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియోలో 13.4 మిమీ డైనమిక్ బాస్ డ్రైవర్, రిచ్ బాస్ బూస్ట్ ఉంటుంది. బడ్స్ వైర్‌లెస్ 3తో పోలిస్తే.. కొంచెం మెరుగైన 13.6ఎమ్ఎమ్ డైనమిక్ బాస్ డ్రైవర్‌ను అందిస్తుంది. అదే డైనమిక్ బాస్ బూస్ట్‌తో అదనంగా ఏఐ ఇఎన్‌సీ (ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్) కాల్ నాయిస్ క్యాన్సిలేషన్, 45ఎమ్ఎస్ అల్ట్రా ఉన్నాయి.

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో డివైజ్ 32 గంటల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉందని పేర్కొంది. ఈ లేటెస్ట్ రియల్‌మి ఫ్లాగ్‌షిప్ కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. ఈ డివైజ్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్‌ని కూడా కలిగి ఉంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్, వాటర్, డెస్ట్ నిరోధకతకు ఐపీ55 రేటింగ్‌ను కలిగి ఉంది. రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో అనేది బడ్స్ వైర్‌లెస్ 3 లాంచ్ చేసిన ఒక ఏడాది తర్వాత రానుంది. ఈ ఇయర్ బడ్స్ ధర రూ. 1,799 నుంచి అందుబాటులో ఉంది.

రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో ధర (అంచనా) :
రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో అసలు ధర రూ.1,299గా నిర్ణయించింది. మే 22, మధ్యాహ్నం 2:30 నుంచి 3 వెబ్‌సైట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. రియల్‌మి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారాల్లో రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 3 నియో భారత్‌లో రియల్‌మి బడ్స్ ఎయిర్ 6, రియల్‌మి రియల్‌మి జీటీ 6టీ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే అదే రోజున లాంచ్ కానుంది. బడ్స్ ఎయిర్ 6 భారత్ ఏకైక హై-రెస్ సర్టిఫైడ్ టీడబ్ల్యూఎస్ అని రియల్‌మి పేర్కొంది. టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌లో 50డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఎఎన్‌సీ) ఉంటుందని 12.4ఎమ్ఎమ్ డీప్ బాస్ డ్రైవర్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది.

Read Also : Infinix GT 20 Pro Launch : హై-ఎండ్ గేమింగ్ ఫీచర్లతో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 21నే భారత్‌లో లాంచ్..!

ట్రెండింగ్ వార్తలు