రాజీనామాకు నేను రెడీ..! భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

సీఎంని కలుస్తా, కలెక్టర్ ను కూడా కలుస్తా. నా దగ్గరున్న ఒరిజినల్ పేపర్లు చూపిస్తా.

Malla Reddy : భూ వివాదానికి సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. నా డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే రాజీనామాకి సిద్ధం అన్న ఆయన.. నువ్వు కూడా సిద్ధమా? అంటూ విప్ లక్ష్మణ్ కి సవాల్ విసిరారు. వాళ్ళవన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి ఆరోపించారు. సర్వే ఇప్పుడే పూర్తి అయింది కదా.. రిపోర్ట్ వచ్చే వరకు అందరు వేచి చూడాలన్నారు. భూ వివాదంపై సీఎం, రెవెన్యూ మంత్రి, కలెక్టర్ ను కలుస్తున్నట్లు
చెప్పారు. నా దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ వారికి చూపిస్తాను అని వెల్లడించారు.

14ఏళ్లకు ముందు ఈ భూములు కొన్నాం, రికార్డుల్లో అన్నీ స్పష్టంగా ఉన్నాయని మల్లారెడ్డి వివరించారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి అమ్మారంటూ మల్లారెడ్డి ఆరోపించారు. రేపు సీఎం దగ్గరకు, అలాగే కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 4వేల గజాలు ఫోర్జరీ చేసి 9మంది రిజిస్ట్రర్ చేసుకున్నట్లుగా డాక్యుమెంట్ సృష్టించారంటూ ఆరోపించారు. నా భూమిని ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసినట్లు మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ డాక్యుమెంట్లు అన్నీ పోలీసులకు చూపించామని చెబుతున్నారు. రేపటి వరకు ఓపిక పడితే అన్నీ తేలతాయి అన్నా మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుచిత్ర సెంటర్ లో భూ వివాదం నెలకొంది.

”వాళ్ల 4వేల గజాలు ఫోర్జరీ డాక్యుమెంట్. నాకున్న 2 ఎకరాల 20 గుంటలు. 2 సర్వే నెంబర్లలో ఉంది. 82, 83. 40ఏళ్లుగా మాది కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా పెట్టుకున్నది కాదు. 14ఏళ్ల క్రితం మేము కొన్నాం. సుధామణి అనే వ్యక్తిది 4 ఎకరాల 4 గుంటలు రోడ్డు అవతల ఉన్నది. 82/ఈ.. అది ఫోర్జరీ డాక్యుమెంట్. సుధాం అనే వ్యక్తి భూమిని గవర్నమెంట్ తీసుకుంది. అది రికార్డులో ఉంది. దాని తర్వాత 9మందికి రిజిస్ట్రర్ చేశారు” అని మల్లారెడ్డి చెప్పారు.

హైదరాబాద్ సుచిత్ర వద్ద సర్వే నెంబర్ 82 మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో సర్వే ముగిసింది. సర్వే రిపోర్టు వచ్చేందుకు ఒకరోజు పట్టే అవకాశం ఉంది. దీంతో ల్యాండ్ వద్ద నుంచి మల్లారెడ్డి వెళ్లిపోయారు. మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో హైడ్రామా కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుచిత్ర సెంటర్ లోని వివాదాస్పద స్థలంలో సర్వే ముగిసింది. భారీ బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు అధికారులు. అయితే, సర్వే జరుగుతున్న ప్రాంతానికి మీడియాను పోలీసులు అనుమతించ లేదు. నిన్న వర్షం కారణంగా జాయింట్ సర్వే వాయిదా పడింది. సర్వే నెంబర్ 84లో తన ల్యాండ్ ఉంటుందన్నారు మల్లారెడ్డి. దౌర్జన్యంగా తన భూమిలోకి ప్రవేశించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే, మల్లారెడ్డి మంత్రిగా ఉన్న టైమ్ లో తమ భూమిని కబ్జా చేశారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతోంది.

Also Read : కేటీఆర్ చెప్పినా వినలేదు.. మల్లారెడ్డి ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు