Central Government Jobs: కేంద్రంలో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. లోక్‌సభలో వెల్లడించిన ప్రభుత్వం

ఈ ఏడాది ఆగష్టు నాటికి కేంద్రంలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలు 23,584కాగా, గ్రూప్ బి ఉద్యోగాలు 1,18,807, గ్రూప్ సి ఉద్యోగాలు 8,36,936 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Central Government Jobs: కేంద్ర సర్వీసుల్లో వివిధ విభాగాల కింద 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బుధవారం పార్లమెంటులో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసింది.

Shraddha Walker: మహారాష్ట్ర పోలీసులు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. డేటింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి: శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్

ఈ ఏడాది ఆగష్టు నాటికి కేంద్రంలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీలున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇందులో గ్రూప్ ఏ ఉద్యోగాలు 23,584కాగా, గ్రూప్ బి ఉద్యోగాలు 1,18,807, గ్రూప్ సి ఉద్యోగాలు 8,36,936 ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి ప్రకటన ప్రకారం.. మొత్తం దేశవ్యాప్తంగా 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రైల్వే శాఖలో 293,943 ఉద్యోగాలు, రక్షణ శాఖ (సివిల్)లో 264,704, కేంద్ర హోం శాఖలో 143,536 ఖాళీలున్నాయి. మార్చి 1, 2021నాటికి కేంద్ర సర్వీసుల్లో 40,35,203 ఉద్యోగాలు మంజూరుకాగా, వాటిలో 30,55,876 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. ప్రధాని కార్యాలయంతోపాటు, రాష్ట్రపతి కార్యాయంలోనూ ఖాళీలున్నాయి.

Pawan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్‌కేనా? వైసీపీపై ట్విట్టర్లో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్

ప్రధాని కార్యాలయంలో 446 ఉద్యోగాలు ఉండగా, వాటిలో 129 ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రపతి కార్యాలయంలో మొత్తం 380 పోస్టులు ఉండగా, అందులో 91 ఖాళీలున్నాయి. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో 1.47లక్షల మందిని కేంద్రం నియమించింది. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ సర్వీస్‌‌లోని సెక్షన్‌ ఆఫీసర్ల కేడర్‌లో సిబ్బంది కొరత ఉంది. వివిధ విభాగాల్లో గత అక్టోబర్‌లో 75 వేల ఉద్యోగాలు భర్తీకాగా, నవంబర్‌లో 71 వేల ఉద్యోగాలు భర్తీ అయినట్లు కేంద్రం వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు