Aadhar Card Free Update : ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఈ తేదీలోగా మీ ఆధార్‌లో ఏదైనా ఫ్రీగా మార్చుకోవచ్చు.. ఆ తర్వాత కష్టమే..!

Aadhar Card Free Update : ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ తేదీలోగా ఆధార్ కార్డులోని ఏదైనా వివరాలను సులభంగా మార్చుకోవచ్చు.

Aadhar Card Free Updation Date Extended

Aadhar Card Free Update : మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలా? పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఏదైనా వివరాలను మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇప్పుడే మార్చేసుకోండి. లేదంటే.. ఆ తర్వాత మార్చుకోవాలంటే జేబులో డబ్బులు ఖర్చు చేయాల్సిందే.. ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తోంది. జూన్ 14 లోగా ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది. కానీ, ఇప్పుడు ఆ గడువు తేదీ ముగిసిపోయింది.

అందుకే, ఆధార్ కార్డు వినియోగదారులకు మరో అవకాశం కల్పిస్తూ గడువు తేదీని కాస్తా వచ్చే సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోలేని సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా (UIDAI) చివరి తేదీని మరో మూడు నెలల వరకు పొడిగించినట్టు వెల్లడించింది. ప్రధానంగా, మీ ఆధార్ కార్డ్ పదేళ్ల క్రితం జారీ అయి ఉండి.. ఇప్పటివరకూ ఎలాంటి అప్‌డేట్ చేయకపోతే.. జూన్ 14లోపు మీ గుర్తింపు కార్డులో అడ్రస్, ఇతర వివరాలను తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ కార్డులో ఏదైనా అప్ డేట్ చేయాలనుకుంటే.. మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్లకు సంబంధించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Pan-Aadhaar Linking Deadline : పాన్-ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదిగో.. ఈ తేదీలోగా లింక్ చేయలేదంటే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆధార్‌ సెంటర్లలో ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ, ఈ ఆధార్ సెంటర్లలో వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఈ క్రమంలోనే ఆధార్ కేంద్రాల్లో రుసుం వసూలుపై కేంద్రం కొత్త నిబంధనలను విధించింది.బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ పొందాలంటే రూ. 100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌ కోసం రూ. 50, ఆధార్‌ డౌన్‌‌లోడ్‌, కలర్‌ ప్రింట్‌కు రూ. 30 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ సెంటర్ల నిర్వాహకులు అంతకన్నా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తే.. వెంటనే ఆధార్‌ సెంటర్‌ కోడ్‌ నెంబర్‌తో టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

Aadhar Card Free Updation Date Extended

మీ ఆధార్ వివరాలను ఎప్పుడు అప్‌డేట్ చేయాలంటే? :
UIDAI ప్రకారం.. ఆధార్ కార్డులోని వివరాల్లో వివాహం, నివాసితులు పేరు, అడ్రస్ వంటి ప్రాథమిక జనాభా వివరాలను మార్చుకోవచ్చు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆయా అడ్రస్‌లు, మొబైల్ నంబర్‌లు కూడా మార్చుకునే వీలుంది. ఇందులో వివాహం, బంధువుల మరణం మొదలైనవి ఉంటాయి. నివాసితులు తమ బంధువుల వివరాలలో మార్పులను కూడా కోరుకోవచ్చు. అదనంగా, నివాసితులు వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ అడ్రస్ మొదలైనవాటిని మార్చడానికి ఇతర వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు.

అడ్రస్ ప్రూఫ్‌ను ఉచితంగా అప్‌లోడ్ చేయడం ఎలా :
https://myaadhaar.uidai.gov.in/ ని విజిట్ చేయండి. మీ వివరాలతో లాగిన్ చేసి.. ‘పేరు, లింగం, పుట్టిన తేదీ, అడ్రస్ అప్‌డేట్ ఎంచుకోండి. ‘Update Aadhaar Online’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. డెమోగ్రాఫిక్ ఆప్షన్ నుంచి అడ్రస్ ఎంచుకుని, ‘Proceed to Update Aadhaar’పై Click చేయండి. డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, అవసరమైన ఇతర ఆప్షన్లను ఎంటర్చేయండి. అవసరమైన పేమెంట్ చేయండి. (సెప్టెంబర్ 14 వరకు ఇప్పుడు వర్తించదు). ఇప్పుడు, సర్వీసు రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఈ డేటాను సేవ్ చేయవచ్చు.

అప్‌డేట్ రిక్వెస్టులను ఎలా ట్రాక్ చేయాలంటే? :
మీరు ఆధార్ అప్‌డేట్ కోసం మీ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్ సమర్పించిన తర్వాత మీకు URN నంబర్ జనరేట్ అవుతుంది. 0000/00XXX/XXXXX అనే ఫార్మాట్‌లో ఉంటుంది. ఆధార్ నంబర్ మీ స్క్రీన్‌పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై కనిపిస్తుంది. మీ URN నంబర్‌ని పొందిన తర్వాత ఈ లింక్ (Aadhaar Update) ద్వారా మీ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

Read Also : Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్‌నెంబర్‌లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు

ట్రెండింగ్ వార్తలు