Arvind Kejriwal: గుజరాత్‌లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాం!

గుజరాత్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ప్రకటించారు.

Aam Aadmi Party: గుజరాత్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్‌లో ప్రకటించారు. అహ్మదాబాద్ పర్యటనలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. అహ్మదాబాద్‌లోని ఆప్ స్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్ ఇసుదన్‌భాయ్ గాధ్వీ కూడా అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో పార్టీలో చేరగా… ఈ సంధర్భంగా కీలక ప్రకటన చేశారు. గుజరాత్ శాసనసభలో 182 సీట్లు ఉండగా.. అన్నీ సీట్లలో పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఆమ్ ఆద్మీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో అధికార BJP, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఆప్ నిలబడుతుందని, 27సంవత్సరాలుగా గుజరాత్‌లో ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉందని, రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు కేజ్రీవాల్. ఢిల్లీలో విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.

డెబ్భై ఏళ్లయినా ఈ రాష్ట్రంలో ఆస్పత్రుల పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని, ఈ స్టేట్ ఇక మారిపోతుందని, గుజరాతీ సోదరులు, సోదరీమణులను కలుసుకునేందుకు తాను మళ్ళీ వస్తానని చెప్పారు. ఇటీవల 120మంది సభ్యులు ఉన్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 27 సీట్లను గెలుచుకోవడంతో గట్టి పోటీ ఇస్తుందనే ధీమాతో ఉన్నారు ఆప్ నాయకులు.

ట్రెండింగ్ వార్తలు