‘ఇక్కడ మోదీ వేవ్ ఉంది’.. మండిలో ఓటుహక్కు వినియోగించుకున్న కంగనా రనౌత్

ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి మండి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ అన్నారు.

Kangana Ranaut

Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 57 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇందులో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మండి పోలింగ్ బూత్ లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం కంగనా మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ వేవ్ ఉందని తెలిపింది.

Also Read : Lok Sabha Election 2024 : కొనసాగుతున్న చివరి విడత ఓటింగ్.. ఉదయం 9గంటల వరకు 11.31శాతం పోలింగ్ నమోదు

ప్రజలంతా ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. మండి ప్రజలు నన్నుఆశీర్వదిస్తారని భావిస్తున్నా. హిమాచల్ ప్రదేశ్ లోని నాలుగు లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.. తద్వారా దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లు దాటడానికి దోహదం చేస్తాయని కంగనా అన్నారు. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీకి ధ్యానం కొత్తకాదు. రాజకీయ నాయకుడు కానప్పుడు కూడా మోదీ ధ్యానం చేసేవారని అన్నారు.

Also Read : భారత రాఫెల్ యుద్ధ విమానాలకు కౌంటర్‌గా పెద్ద ప్లాన్ వేసి.. సరిహద్దుల వద్ద అమలు చేస్తున్న చైనా

మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. విక్రమాదిత్య సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రి అయిన వీరభద్ర సింగ్ కుమారుడు. కంగనా రనౌత్ కు సెలబ్రిటీ ఇమేజ్, ప్రధాని నరేంద్ర మోదీ వేవ్, రామ మందిరం వంటి ప్రధాన అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. మరోవైపు వీరభద్ర కుటుంబానికి మండి నియోజకవర్గం కంచుకోట. దీంతో ఇక్కడ తామే గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇరు పార్టీలు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజవంశీయుల కోటలో కంగనా రనౌత్ విజయకేతనం ఎగురవేస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.