ముగిసిన చివరి విడత పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.

ముగిసిన చివరి విడత పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్

Lok Sabha Election 2024

Updated On : June 1, 2024 / 6:11 PM IST

Lok Sabha Election Phase 7 Voting : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి విడత పోలింగ్ కొన్ని చదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 58.34 శాతం పోలింగ్ నమోదైంది.

సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 

  • బిహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 48.86 శాతం పోలింగ్ నమోదు
  • చండీగఢ్ లో 62.80 శాతం పోలింగ్ నమోదు
  • హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 66.56 శాతం పోలింగ్ నమోదు
  • జార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 67.95 శాతం పోలింగ్ నమోదు
  • ఒడిశాలో 6 లోక్ సభ స్థానాల్లో 62.46 శాతం పోలింగ్ నమోదు
  • పంజాబ్ లో 13 స్థానాల్లో 55.20 శాతం పోలింగ్ నమోదు
  • ఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 54. శాతం పోలింగ్ నమోదు
  • పశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 68.98 శాతం పోలింగ్ నమోదు

మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు

  • బిహార్ లో 8 లోక్ సభ స్థానాల పరిధిలో 42.95 శాతం పోలింగ్ నమోదు
  • ఛండీఘడ్ లో 52.61 శాతం పోలింగ్ నమోదు
  • హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలో 58.41 శాతం పోలింగ్ నమోదు
  • జార్ఖండ్ లో మూడు లోక్ సభ స్థానాల్లో 60.14 శాతం పోలింగ్ నమోదు
  • ఒడిశాలో 6 లోక్ సభ స్థానాల్లో 49.77 శాతం పోలింగ్ నమోదు
  • పంజాబ్ లో 13 స్థానాల్లో 46.38 శాతం పోలింగ్ నమోదు
  • ఉత్తరప్రదేశ్ 13 స్థానాల్లో 46.83 శాతం పోలింగ్ నమోదు
  • పశ్చిమ బెంగాల్ 9 లోక్ సభ స్థానాల్లో 58.46 శాతం పోలింగ్ నమోదు

మొత్తం ఏడు విడతల్లో 543 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తికాగా.. ఇవాళ జరిగే ఏడో విడతలో మొత్తం 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకాగా.. మధ్యాహ్నం 1గంట వరకు 40.09శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ లో 35.65 శాతం, ఛండీఘడ్ లో 40.15 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 48.63 శాతం, జార్ఖండ్ లో 46.80 శాతం, ఒడిస్సా లో 37.64 శాతం, పంజాబ్ లో 37.80 శాతం, ఉత్తరప్రదేశ్ లో 39.31శాతం , పశ్చిమ బెంగాల్ లో 45.07 శాతం పోలింగ్ నమోదైంది.

Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?

చివరి విడత పోలింగ్ లో.. ఉత్తరప్రదేశ్ -13, పంజాబ్ – 13, పశ్చిమ బెంగాల్ – 9, బిహార్ – 8, ఒడిశా – 6, ఝార్ఖండ్ – 3, హిమాచల్ ప్రదేశ్ -4, ఛండీగడ్ -1 లోక్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో 95 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.  అంతేకాక ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లో ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

Also Read : ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. మహిళా పోలీసులతో అరెస్ట్ చేయించిన సిట్

57లోక్ సభ నియోజకవర్గాల్లో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 5.24 కోట్ల మంది, మహిళలు 4.82 కోట్ల మంది, ఇతరులు 3,574 మంది ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

7వ విడతలో పోటీచేస్తున్న ముఖ్యనేతలు వీరే..
ప్రధాని నరేంద్ర మోదీ (వారణాసి)
రవి శంకర్ ప్రసాద్ (పాట్నా సాహెబ్ )
ఒమర్ అబ్దుల్లా (బారాముల్లా)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (మండీ)
భోజ్ పూర్ నటుడు రవి కిషన్ (గోరఖ్పూర్)
అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్)
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ (అమీర్ పుర్)
మీసా భారతి (పాటలీపుత్ర)
హర్ సిమ్రత్ కౌర్ బాధల్ (బటిండా)
పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని (జలంధర్)
ఆర్.కె. సింగ్ (ఆరా)
పంకజ్ చౌధరీ (మహారాజ్ గంజ్)

పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. పలువురు ప్రముఖులుసైతం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, అఫ్జల్ అన్సారీ, తరంజిత్ సింగ్, అనుప్రియా పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రవికిషన్, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.