JEE Advanced 2024 Answer Key To Be Out Tomorrow ( Image Credit : Google)
JEE Advanced 2024 Answer Key : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 కోసం ప్రొవిజినల్ ఆన్సర్ కీని జూన్ 2, 2024న విడుదల చేయనుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో కీని చెక్ చేయగలరు. ఒకసారి విడుదలైన తర్వాత విద్యార్థులు తాత్కాలిక కీలో ఏదైనా సమాధానాన్ని అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంటుంది.
ఏదైనా ప్రశ్నకు ఏదైనా విద్యార్థి అభిప్రాయాన్ని లేదా అభ్యంతరాన్ని సమర్పించిన సందర్భంలో అది మారవచ్చు. ప్రారంభంలో విడుదల చేసిన కీ తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. జూన్ 2 నుంచి 3వ తేదీ వరకు ప్రశ్నలపై అభ్యంతరాలు తెలపవచ్చు. అభ్యంతరాలను సమర్పించిన తర్వాత అధికారులు సవాళ్లను సమీక్షించి ధృవీకరిస్తారు. అభ్యర్థుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ జూన్ 9, 2024న వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయనుంది.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- అడ్వాన్స్‌డ్ (JEE అడ్వాన్స్‌డ్) 2024 మే 26న రెండు సెషన్‌లలో నిర్వహించింది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది.
ఇంజనీరింగ్, సైన్సెస్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలలో బ్యాచిలర్ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీలు, బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాన్ని అందించడానికి ప్రవేశ పరీక్ష నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఐఐటీలో సీటు కోసం జాయింట్ సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా కోర్సులు, ఇన్‌స్టిట్యూట్‌ల వారి ప్రాధాన్యత ఆప్షన్ల ద్వారా ఉమ్మడి సీట్ల కేటాయింపు ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి.
Read Also : WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ ఫొటోలు, వీడియోలను హైక్వాలిటీతో అప్‌లోడ్ చేయొచ్చు