iPhone 16 Pro : భారీ కెమెరా హౌసింగ్‌, బిగ్ సెన్సార్‌లతో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో వచ్చేస్తోంది.. లీకైన వివరాలివే!

iPhone 16 Pro Launch : ఇప్పటికే ఐఫోన్ 16 ప్రో డిజైన్, ఫీచర్లు, కలర్ ఆప్షన్లు వంటి వివిధ ఫీచర్ల వివరాలను అంచనా వేస్తున్నాయి. టిప్‌స్టర్ ఇప్పుడు ఐఫోన్ పెద్ద కెమెరా ఐలాండ్‌తో పాటు కొత్త సెన్సార్‌లతో రానుందని పేర్కొంది.

iPhone 16 Pro May Get a Larger Camera Housing ( Image Credit : Google )

iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు అదిరే న్యూస్.. అతి త్వరలో ఐఫోన్ 16ప్రో భారీ కెమెరాతో రాబోతోంది. ఇటీవలి లీక్ ప్రకారం.. ఐఫోన్ 16ప్రో గత జనరేషన్ ఐఫోన్లతో పోలిస్తే.. వెనుకవైపు భారీ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండవచ్చు. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ వరకు లాంచ్ కానున్నప్పటికీ, ఇప్పటికే ఐఫోన్ 16 ప్రో డిజైన్, ఫీచర్లు, కలర్ ఆప్షన్లు వంటి వివిధ ఫీచర్ల వివరాలను అంచనా వేస్తున్నాయి. టిప్‌స్టర్ ఇప్పుడు ఐఫోన్ పెద్ద కెమెరా ఐలాండ్‌తో పాటు కొత్త సెన్సార్‌లతో రానుందని పేర్కొంది.

Read Also : Vivo S19 Pro Series : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో S19 ప్రో సిరీస్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ఐఫోన్ 16 ప్రోలో భారీ కెమెరాలు (అంచనా) :
మే 28న ఐఫోన్ 16 ప్రో కేసు స్క్రీన్‌షాట్‌లను భారీ కెమెరా కటౌట్‌లతో పోస్ట్ చేసింది. ఐఫోన్ 16 ప్రో విషయంలో కెమెరా మాడ్యూల్ చాలా పెద్దదని టిప్‌స్టర్ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. ఐఫోన్ 16 ప్రోకి ముందున్న దానితో పోలిస్తే.. పెద్ద కెమెరా సెన్సార్లు వస్తున్నాయని అంచనా. ఆపిల్ ప్రో మోడల్స్ కోసం డిస్‌‌ప్లే సైజులను పెంచవచ్చని కూడా నివేదించింది.

ఐఫోన్ 16 ప్రో 0.2-అంగుళాల పెరుగుదల ఉండనుంది. 6.1-అంగుళాల నుంచి 6.3-అంగుళాలకు పెరగనుంది. మరోవైపు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ కూడా భారీ 6.9-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గత నివేదికల ప్రకారం.. ఐఫోన్ 16 ప్రో కూడా ప్రో మాక్స్ మోడల్ మాదిరిగానే 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందించే భారీ సెన్సార్‌ను పొందవచ్చని సూచించింది.

ఐఫోన్ 16 ప్రో బ్రైట్‌ డిస్‌ప్లే (అంచనా) :
ఈ నెల ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో భారీ డిస్‌ప్లేను మాత్రమే కాకుండా ప్రకాశవంతంగా కూడా ఉంటుందని అంచనా. వెయిబో పోస్ట్‌లో ఎస్‌డీఆర్ కంటెంట్‌ని ప్లే చేస్తున్నప్పుడు ఐఫోన్ 16 ప్రో, 1,200నిట్స్ వరకు సాధారణ ప్రకాశానికి సపోర్టు ఇస్తుందని టిప్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ పేర్కొంది. అదే నిజమైతే, ఐఫోన్ 15ప్రో 1,000 నిట్స్ పరిమితి కన్నా 20 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మరోవైపు, హెచ్‌డీఆర్ కంటెంట్‌ని ప్లే చేస్తున్నప్పుడు గరిష్ట ప్రకాశం 1,600 నిట్‌లుగా ఉండవచ్చు. ప్రస్తుత హ్యాండ్‌సెట్‌ల కన్నా అప్‌గ్రేడ్ ఉండదని సూచిస్తుంది.

Read Also : WhatsApp Users : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై మీ ఫొటోలు, వీడియోలను హైక్వాలిటీతో అప్‌‌లోడ్ చేయొచ్చు