Manoj Muntashir : మేము తీసింది రామాయణం కాదు.. రామాయణం ఆధారంగా చేశాం అంతే.. మాట మార్చిన ఆదిపురుష్ రైటర్..

సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ పై వివాదం చెలరేగుతుంది. పైగా దీన్ని ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ ముంతషీర్ సమర్ధించుకోవడంతో అతనిపై మరింత ఫైర్ అవుతున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ పై ట్రోల్స్ తోనే నిండిపోయింది.

Adipurush is not Ramayanam said by writer manoj muntashir

Adipurush :  తాజాగా ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా రిలీజయిన సంగతి తెలిసిందే. ముందు నుంచి భారీ హోప్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు కానీ రిలీజయ్యాక అంతా రివర్స్ అయింది. రామాయణం(Ramayanam) అని చెప్పి ఏదో తీశారని, పాత్రల ఆహార్యం మార్చేశారని, రామాయణం ఎక్కడా చూపించలేదని, డైలాగ్స్ కూడా సరిగ్గా రాయలేదని, VFX కూడా దారుణంగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు ఆదిపురుష్ సినిమాపై, డైరెక్టర్ ఓం రౌత్ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ పై వివాదం చెలరేగుతుంది. పైగా దీన్ని ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ ముంతషీర్ సమర్ధించుకోవడంతో అతనిపై మరింత ఫైర్ అవుతున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ పై ట్రోల్స్ తోనే నిండిపోయింది. హనుమంతుడి డైలాగ్స్ పై నార్త్ లో పెద్ద వివాదమే చెలరేగుతుంది. ముందు నుంచి కూడా ఈ సినిమా రామాయణం అని ప్రమోట్ చేశారు. జై శ్రీరామ్ అంటూ, హనుమంతుడికి సీట్ అంటూ రకరకాల ప్రమోషన్స్ చేసి ఇది రామాయణమే అని చెప్పారు. తాజాగా ఇలా సినిమాపై విమర్శలు వస్తుండటంతో రైటర్ మనోజ్ మాట మార్చేశాడు.

Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం

తాజాగా మనోజ్ ముంతషీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిపురుష్ పై వచ్చిన ట్రోల్స్ కి సమాధానంగా.. మేము తీసింది రామాయణం కాదు, కేవలం రామాయణాన్ని ఆధారంగా తీసుకొని, దాని నుండి బాగా స్ఫూర్తి పొంది తీశాము అంతే అని అన్నాడు. దీంతో మనోజ్ పై మరింత విమర్శలు ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లు రామాయణం అని చెప్పి ప్రమోట్ చేసి, ఇప్పుడేమో రామాయణం కాదంటావా, ప్రేక్షకులు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా అంటూ మనోజ్ పై ఫైర్ అవుతున్నారు ప్రేక్షకులు. మరి ఈ ఆదిపురుష్ వివాదం ఇంకెంతవరకు వెళ్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు