Maharashtra Politics: అంతు చిక్కని మహా రాజకీయం.. శరద్ పవార్‭ను కలిసి ఆశీర్వాదం తీసుకుని షాకిచ్చిన అజిత్ పవార్ బృందం

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్‭ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట.

Pawar and Pawar: మహారాష్ట్ర రాజకీయం అంతు చిక్కడం లేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అర్థం కావడం లేదు. ఎవరు కలుస్తారో, ఎవరూ విడిపోతారో రాజకీయ పండితులకు సైతం ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. శరద్ పవార్ మీద అజిత్ పవార్ తిరుగుబాటు గురించి ఎవరూ ఊహించలేదు. అంతకు ముందు శివసేనలో తిరుగుబాటు జరిగినప్పటికీ.. ఎన్సీపీలో అలాంటి పరిణామాల గురించి ఎక్కడా వినిపించలేదు. సరే.. తిరుగుబాటు జరిగిపోయింది. ఇరు పక్షాల నుంచి కొన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.

Congress Supports AAP: అనూహ్య పరిణామం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్

తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటన కూడా ప్రారంభించారు. అంతలోనే ఇరు వర్గాలు కలుసుకున్నాయి. కలుసుకున్నాయి అంటే పార్టీ పరంగా ఏకం కాలేదు. అజిత్ పవార్ వర్గం తాజాగా శరద్ పవార్‭ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. తిరుగుబాటు చేసిన రెండు వారాల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం అందరికీ షాకింగనే చెప్పవచ్చు. అయితే ఇది శరద్ పవార్‭ను శాంతింపజేసే ప్రయత్నమని అంటున్నారు.

Governor Tamilisai : బోనాలకు ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు : గవర్నర్

“మేమంతా మా దేవుడు శరద్ పవార్ నుంచి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. పవార్ సాహెబ్ ఇక్కడ ఉన్నారని మేము తెలుసుకున్నాము. కాబట్టి మేము ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాము. ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికే ఇక్కడకు వచ్చాము” అని సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ చెప్పారు. జూలై 2న బీజేపీ-శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరింది. అనంతరం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Chikoti Praveen: బోనాల వేళ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద కలకలం రేపిన చీకోటి ప్రవీణ్ అనుచరులు

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్సీపీ ఐక్యంగా ఉండాలని పవార్‭ను కోరారట. కానీ అందుకు ఆయన అంగీకరించలేదట. గంటసేపు జరిగిన సమావేశంలో ఆ నేతలు చర్చించిన ప్రముఖ విషయం ఇదేనట. ఈ విషయాన్ని ప్రఫుల్ పటేలే స్వయంగా వెల్లడించారు. తిరుగుబాటు చేసిన అనంతరం ఇరు వర్గాల ఎన్సీపీ ఎమ్మెల్యేల మధ్య ఇదే మొదటి సమావేశం. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో హాజరయ్యారు. శరద్ పవార్ వర్గానికి చెందిన సుప్రియా సూలే, జయంత్ పాటిల్, జితేంద్ర అవద్ కూడా ఇందులో ఉండడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు