Maharashtra Politics: ఔరంగాజేబ్ సమాధిని సందర్శించిన అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్

ఔరంగాబాద్ పేరు మార్చిన వారికి కూడా తెలుసు, ఈ దేశాన్ని 50 ఏళ్లు ఔరంగాజేబే పాలించాడని. చరిత్రలోని నిజాల్ని ఎవరూ చెరిపివేయలేరు. జైచంద్ లాంటి కొంతమంది కుట్రదారుల వల్ల ఔరంగాజేబ్ పాలన వచ్చిందని బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఆ జయచందులను ఎందుకు ప్రశ్నించరు?

Prakash Ambedkar: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ మనవడు అయిన ప్రకాష్ అంబేద్కర్ ఆదివారం మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగాజేబ్ సమాధిని సందర్శించారు. ఔరంగాబాద్ నగరంలో ఉన్న ఈ సమాధి వద్ద ప్రకాష్ అంబేద్కర్ ప్రార్థనలు సైతం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత కాలంగా ఔరంగాజేబ్ సమాధి వివాదాస్పంగా మారింది. అక్కడికి ఎవరైనా వెళ్లినా, లేదంటే ఔరంగాజేబ్ గురించి మాట్లాడినా రైట్ వింగ్ సంస్థలు, పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔరంగాజేబ్ సమాధిని వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత అయిన ప్రకాష్ అంబేద్కర్ సందర్శించడమే కాకుండా, అక్కడ ఆయన ప్రార్థనలు చేయడం వైరల్ అవుతోంది.

Thalapathy Vijay : 10 గంటలు పైగా స్టేజిపై నించొని.. 1000 మందికి పైగా స్టూడెంట్స్ కి సన్మానం చేసి.. వైరల్ అవుతున్న తలపతి విజయ్..

అయితే ఔరంగాజేబ్ సమాధిని సందర్శించిన అనంతరం ప్రకాష్ అంబేద్కర్ మీడియోతో మీట్లాడుతూ ‘‘ఖౌల్దాబాద్ చారిత్రాత్మక నగరమని మనందరికీ తెలుసు. ఔరంగాబాద్ పేరు మార్చిన వారికి కూడా తెలుసు, ఈ దేశాన్ని 50 ఏళ్లు ఔరంగాజేబే పాలించాడని. చరిత్రలోని నిజాల్ని ఎవరూ చెరిపివేయలేరు. జైచంద్ లాంటి కొంతమంది కుట్రదారుల వల్ల ఔరంగాజేబ్ పాలన వచ్చిందని బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పారు. మరి ఆ జయచందులను ఎందుకు ప్రశ్నించరు? బ్రిటిషర్ల మీద కూడా విమర్శలు చేస్తారు. మరి వారి మీద చేసే దమ్ము ఎందుకు లేదు?’’ అని అన్నారు.

Uddhav Thackeray: ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని వీడిన ఎమ్మెల్సీ మనీషా.. షిండే వర్గంలోకి జంప్..

అయతే ప్రకాష్ అంబేద్కర్ చర్యలపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అజిత్ ఛవాన్ స్పందిస్తూ ‘‘ఔరంగాజేబ్ సమాధి ముందు మోకరిల్లిన ప్రకాష్ అంబేద్కర్‭తో పొత్తుకు ఉద్దవ్ థాకరే ఇంకా సిద్ధంగా ఉన్నారా అనేది చెప్పాలి. శంభాజీ మహరాజును చంపిన వాడిని ప్రకాష్ అంబేద్కర్ గౌరవిస్తున్నారు. అసలు ప్రకాష్ అంబేద్కర్ ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అని అన్నారు. అయితే ఔరంగాజేబ్ సమాధిని సందర్శించడం ప్రకాష్ అంబేద్కర్‭కు ఇది కొత్త కాదు. గతంలో అసదుద్దీన్ ఓవైసీతో కలిసి సందర్శించారు.

ట్రెండింగ్ వార్తలు