Supreme Court : కారుణ్య నియామకం హక్కు కాదు..ఆటోమేటిక్ అంతకంటే కాదు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కారుణ్య నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదు..ఆటోమేటిక్ అంతకంటే కాదని వ్యాఖ్యానించింది.

Appointment on compassionate grounds not automatic : ప్రభుత్వ కార్యాలయాల్లో కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే (అతడు లేక ఆమె) వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగ నియామకంపై ధర్మాసనం పలు పాయింట్లు లేవనెత్తుతు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కారుణ్య నియామకం హక్కు కాదని అది సంపూర్ణ హక్కు కాదు’ అని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే డిపెండెంట్‌కు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని..ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి (ఉద్యోగి) కుటుంబం ఆర్థిక స్థితిగతులు, సదరు ఉద్యోగికి సంబంధించిన కుటుంబం ఏ మేరకు ఆధారపడ్డారు? ఆ ఉద్యోగమే వారికి పూర్తి ఆధారమా? లేక వారు ఏదైనా వృత్తి, వ్యాపారాల్లో ఉన్నారా? వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాలని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం (డిసెంబర్ 16,2021) స్పష్టం చేసింది.

Read more : Breastfeeding Hight : తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు కీలక తీర్పు

సర్వీస్‌ నిబంధనల్లో కారుణ్య నియామకం అనేది జరుగుతోంది పలు సందర్భాల్లో. ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా..వారి కుటుంబంలో ఓ వ్యక్తికి అది భార్య అయినా..కొడుకు అయినా కావచ్చు..వారికి ఆ ఉద్యోగం గానీ లేదా వారి చదువుకు తగిన ఉద్యోగం గాని కల్పించబడుతోంది. ఈక్రమంలో ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా.. ఎటువంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Read more : Supreme court :మాస్టారు మందలిస్తే అది విద్యార్ధి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదు : సుప్రీంకోర్టు

‘కానీ..ప్రస్తుతం కారుణ్య నియామకం అలా కాదు. అది వివిధ పరిమితులకు లోబడి ఉంటుంది. చనిపోయిన ఉద్యోగి కుటుంబం ఆర్థిక పరిస్థితులు..ఆ కుటుంబం ఏమేరకు ఆ సదరు ఉద్యోగిపై ఆధారపడి ఉంది? వారు వృతులు, ఉద్యోగాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Read more :Breast Feeding Week : తల్లిపాల వారోత్సవాలు 2021.. అమ్మపాలు బిడ్డకు రక్ష తల్లికి శ్రీరామ రక్ష

భీమేశ్‌ అనే వ్యక్తికి కారుణ్య కారణంతో ఉద్యోగం ఇవ్వాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెడుతూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. భీమేశ్‌ సోదరి కర్ణాటక గవర్నమెంట్ స్కూల్లో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తూ 2010లో చనిపోయారు. అవివాహిత అయిన ఆమెకు తల్లి, ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సోదరి ఆదాయంపై తమ కుటుంబం ఆధారపడి ఉందని..తనకు కారుణ్య కారణాలతో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటూ భీమేశ్‌ అధికారుల్ని కోరగా వారు భీమేశ్ కోరికను తిరస్కరించారు. దీంతో..భీమేష్ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లగా తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.

Read more : Living Together : ప్రేమ జంటకు రూ.25వేలు ఫైన్..కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదన్న హైకోర్టు

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దీనిపై కర్ణాటక కోర్టు ట్రిబ్యునల్‌ తీర్పునే సమర్థించింది. దీంతో..ఆ రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సదరు ఉద్యోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు పలు అంశాలను పరిశీలించాల్సిన తరువాత కారుణ్య నియామకం చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు