IPL 2024 : సీఎస్కేపై విజయం తరువాత ఆర్సీబీ ప్లేయర్స్ సంబరాలు చూశారా? వీడియోలు వైరల్

సీఎస్కే జట్టుపై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదుచేసి ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లింది. సీఎస్కేపై విజయం తరువాత ఆ జట్లు ఆటగాళ్ల సంబరాలు..

RCB Team (credit - twitter)

IPL 2024 RCB Players : ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి సీఎస్కే జట్టుపై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. సీఎస్కేపై విజయం తరువాత ఆ జట్లు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ నుంచి విరాట్ కోహ్లీతోపాటు జట్టులోని ఆటగాళ్లందరూ పెద్దెత్తున మైదానంలో సంబరాలు చేసుకున్నారు.

Also Read : IPL 2024 : సీఎస్కేపై థ్రిల్లింగ్ విక్టరీ తరువాత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆసక్తిక వ్యాఖ్యలు

ఊహించనివిధంగా ప్లేఆఫ్స్ కు చేరుకోవటంతో ఆర్సీబీ జట్టులోని ప్రతి ఆటగాడిలో ఆనందం వెల్లివిరిసింది. విజయం ఖాయం కాగానే విరాట్ కోహ్లీ, డూప్లెసిస్తో తోపాటు మిగిలిన ఆటగాళ్లు మైదానంలో పరుగులుతీస్తూ సందడి చేశారు. పలువురు ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆర్సీబీ జట్టు విజయంతో స్టేడియంలో మ్యాచ్ ను వీక్షిస్తున్న విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ భావోద్వేగానికి గురయ్యారు. స్టేడియంలో కోహ్లీసైతం భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : Virat kohli : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారత్ క్రికెటర్ అతనే