Virat kohli : ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. ఆ జాబితాలో తొలి భారత్ క్రికెటర్ అతనే
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 708 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దనే ఉంది.

Virat kohli
IPL 2024 Virat Kohli : ఐపీఎల్ 2024 సీజన్ లో శనివారం రాత్రి అద్భుత మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లలో ఆర్సీబీని విజయం వరించింది. చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో ప్లే ఆప్స్ కు దూసుకెళ్లింది.
Also Read : IPL 2024 : సీఎస్కేపై థ్రిల్లింగ్ విక్టరీ తరువాత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఆసక్తిక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2024 సీజన్ లో ఇప్పటి వరకు 14 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 708 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ అతని వద్దనే ఉంది. ఇదే సమయంలో కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సీజన్లలో 700 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ కంటే ముందు వరుసగా క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 733 పరుగులు చేయగా.. 2013 ఐపీఎల్ సీజన్ లో 708 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ తరువాత విరాట్ కోహ్లీ రెండోస్థానంలో ఉన్నాడు.
Also Read : RCB vs CSK : ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. పోరాడి ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ
ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు కోహ్లీ 708 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 155.60. ఇప్పటి వరకు ఐపీఎల్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ ఇదే. ఇదిలాఉంటే.. భారత్ వేదికగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీనే. తాజాగా సీఎస్కేపై ఇన్నింగ్స్ తో కోహ్లీ 9000ప్లస్ స్కోరును నమోదు చేశాడు. అతడి తరువాత రోహిత్ 8,008 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
Aggressive King Kohli & Chinnaswamy roaring. ? pic.twitter.com/zIsXnW0wZq
— Johns. (@CricCrazyJohns) May 18, 2024