Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ బర్త్ డే.. ‘ఎపిక్’ సినిమా గ్లింప్స్ రిలీజ్.. భలే ఉందే.. అమృతం పాటతో..
నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.(Anand Deverakonda)
Anand Deverakonda
Anand Deverakonda : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కుతున్న సినిమా ఎపిక్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 90s వెబ్ సిరీస్ లో చిన్న పిల్లాడు పెద్దయ్యాక లండన్ వెళ్లి అక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటె ఎలా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఎపిక్ సినిమా నుంచి సాంగ్, గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పగా నేడు ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో లండన్ లో ఆనంద్ పుట్టినరోజు పార్టీ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు, పేరెంట్స్ ఫోన్ చేసి విషెష్ చెప్పినట్టు, ఫ్రెండ్స్ అంతా అమృతం సీరియల్ సాంగ్ పాడినట్టు చూపించారు. దీంతో ఈ గ్లింప్స్ క్యూట్ గా ఉంది.
Also Read : Suyodhana : ‘సుయోధన’ టీజర్ రిలీజ్.. దుర్యోధనుడిగా సాయికుమార్..
మీరు కూడా ఆనంద్ దేవరకొండ ఎపిక్ గ్లింప్స్ చూసేయండి..
