Indian Army: రెండు వందల మంది తీవ్రవాదులు చొరబాటుకు సిద్ధం: ఇండియన్ ఆర్మీ

దాదాపు 200 మంది తీవ్రవాదులు సరిహద్దు దాటి, జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Indian Army: దాదాపు 200 మంది తీవ్రవాదులు సరిహద్దు దాటి, జమ్ము-కాశ్మీర్‌లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ హెచ్చరించింది. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో చొరబాట్లు తగ్గాయన్నారు. ‘‘గతేడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మంచి ఫలితాలను ఇస్తోంది. స్థానికుల సహకారంతో ఈ ఏడాది ఇప్పటివరకు 21 మంది తీవ్రవాదులను అంతం చేశాం. ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దుల్లో మరో 200 మంది తీవ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనవైపు నుంచి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

Army Jobs : ఈస్టర్న్ కమాండ్ ఆర్మీలో పోస్టుల భర్తీ

అయితే, సరిహద్దుల్లో మన సైన్యం జాగ్రత్తగా గస్తీ కాస్తుండటంతో అక్రమ చొరబాట్లకు అవకాశం లేదు. గడిచిన ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. తీవ్రవాదుల్ని త్వరగా గుర్తించి అంతం చేయాలన్నదే మా అంతిమ లక్ష్యం. స్థానికులు పాక్ ప్రేరేపిత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవ్వకుండా వాళ్లని చైతన్య పరుస్తున్నాం. దాదాపు 15,000 మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకునే దిశగా ప్రోత్సహిస్తున్నాం’’ అని ద్వివేది అన్నారు.

ట్రెండింగ్ వార్తలు